IIFA Utsavam 2024: ఐఫాలో రానా, తేజ సజ్జా ఏమన్నారు? అంత రచ్చ ఎందుకు జరుగుతోంది?

సెటైర్లు వేయడం ఓ ఆర్ట్‌.. ఆ సెటైర్లని రిసీవ్‌ చేసుకోవడం ఇంకా పెద్ద ఆర్ట్‌. ఇందులో ఏది రాకపోయినా పరిస్థితి పెంట పెంట అయిపోతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొంది. ఇటీవల ఘనంగా జరిగిన ఐఫా ఉత్సవం (IIFA Utsavam) అవార్డుల కార్యక్రమానాకి హాస్టింగ్‌ చేసిన రానా (Rana Daggubati) , తేజ సజ్జా (Teja Sajja) సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. మా హీరోను అలా ఎలా అంటారు, మా డైరక్టర్‌ను అలా ఎలా అంటారు అని విమర్శలు వస్తున్నాయి. అయితే వాళ్లు అన్న మాటల్లో నిజాలున్నాయి కదా అని మరికొంతమంది అంటున్నారు.

IIFA Utsavam 2024

టాలీవుడ్‌లో కాంట్రవర్శీకి దూరంగా ఉండే నటుల్లో రానా ఒకరు. ఇప్పుడిప్పుడే హీరోగా మంచి సినిమాలు చేస్తున్న కుర్ర హీరో తేజ సజ్జా. ఇద్దరూ కలసి సరదాగా సెటైర్లు వేశారు. అందులో తమ మీద తాము కూడా జోకులేసుకున్నారు. ఐఫా అవార్డుల వేడుకలు బాలీవుడ్‌ వెర్షన్లు చూసిన వారికి రానా, తేజ మాటలు పెద్ద కొత్తగా అనిపించవు. టాలీవుడ్‌ జనాలకు అయితే పూర్తిగా కొత్త అని చెప్పాలి. ఇక మన సినిమా ప్రేక్షకులకు ఇంకా కొత్త.

రానా, తేజ సజ్జా తమ హీరోలకు క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అంతగా వాళ్లిద్దరూ ఏమన్నారు, ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా అని తెలియాలి అంటే.. అక్కడ ఏమైందో తెలియాలి. ఐఫా ఉత్సవంలో (IIFA Utsavam) హోస్ట్‌ల సెటైర్లు, కామెంట్లు ఓ ఆర్డర్‌లో చూస్తే.. తొలుత తేజ సజ్జా గురించి ఇంట్రడక్షన్‌ ఇస్తున్నట్లుగా రానా మాట్లాడి.. ఆఖరికి అవి మహేష్‌ బాబు (Mahesh Babu) కోసం అంటాడు. దానికి తేజ ‘అవి నాకు సింక్‌ అయ్యాయి ఏంటి?’ అని అంటాడు.

అక్కడితో ఆ టాపిక్‌ ఆగకుండా.. ‘ఇద్దరూ సంక్రాంతికే వచ్చారు’ అని రానా అంటే.. దానికి ‘ఆ టాపిక్‌ గురించి మాట్లాడకు’ అని తేజ అంటాడు. ఏంటి అంత సెన్సిటివ్‌ టాపిక్కా అంటే కాదు నేను సెన్సిటివ్‌ అంటాడు. ఎందుకల అన్నాడు అని చూస్తే.. మొన్న సంక్రాంతికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వర్సెస్‌ ‘హను – మాన్‌’ (Hanu Man) అనే పరిస్థితి వచ్చింది. దాని మీద పెద్ద చర్చలే జరిగాయనే విషయం తెలిసిందే.

ఈ డిస్కషన్‌ తర్వాత ‘ఐఫా’ గేమ్‌ ఛేంజర్‌ అవ్వాలి అని తేజ అంటే.. గేమ్‌ ఛేంజర్‌ అనకురా.. అలా అంటే మరో రెండేళ్లు లేట్‌ అవుతుంది అనేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) సినిమాను గుర్తు చేశాడు రానా. ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారేమో అని తేజ అంటే.. వాళ్లే ఫ్రస్టేషన్‌ ఉన్నారు బాసూ అని లైట్‌ చేసేశాడు. ఆ తర్వాత దిల్‌ రాజు (Dil Raju) పేరును ‘హార్ట్‌ కింగ్‌’ అని మార్చి ‘వారసుడు’ (Varasudu) సినిమా ఈవెంట్‌లో ‘ఇరుక్కు’ డైలాగ్‌ను చెప్పాడు రానా.

ఆ 2023 రీకాప్‌ అంటూ కొన్ని మోనోలాగ్‌లు చెప్పారు. ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌ లేట్‌ అయింది కాబట్టి ‘పుష్ప: టూ లేట్‌’ అని మార్చారు. ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా కోసం ప్రతి థియేటర్‌లో ఓ సీట్‌ని ఆంజనేయ స్వామికి వదిలేశారు అని.. కానీ ఆంజనేయస్వామి సినిమాను ఓటీటీలో చూద్దామని వదిలేశాడు అని సినిమా రిజల్ట్‌పై జోకేశారు. మా ‘మా’ ప్రెసిడెంట్‌ అని రానా టాపిక్‌ తీయగా.. తేజ వద్దు అంటాడు. దాంతో రానా ‘ఎందుకులే 48 గంటల్లో డిలీట్‌ చేయమంటాడు’ అని విష్ణు మంచుపై (Manchu Vishnu) సెటైర్‌ పడింది.

బచ్చన్‌ గారికి ఈ ఏడాది హైయస్ట్ హై.. లోయస్ట్‌ లో కూడా వచ్చింది అని రానా అంటే.. అదెలా అని తేజ అడగుతాడు. హైయస్ట్ హై ‘కల్కి’ (Kalki 2898 AD) కదా.. మరి లోయస్ట్‌ లో ఏంటి అని అడిగితే.. మొన్న రిలీజ్‌ అయిందిగా ‘మిస్టర్‌..’ అని ఆపేస్తాడు రానా. అది ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) సినిమా గురించే అని అర్థం చేసుకోవాలి. ఇక హోస్టింగ్‌ కోసం బాలయ్యకు రానా ఫోన్‌ చేసినట్లు ఓ సెగ్మంట్‌ ఉంది. అందులో బాలయ్య ఓల్డ్‌ వైరల్‌ వాయిస్‌ ‘అలా చెప్పు గాడిద’ వినిపించి నవ్వించారు.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) స్టేజీ మీదకు వచ్చినప్పుడు నీ క్యారెక్టర్‌ చనిపోతే సినిమా హిట్‌.. నీ పాత్ర బతికి ఉంటే సినిమా ఫట్‌ అని రానా కౌంటర్‌ ఇస్తాడు. సమంత స్టేజీ మీదకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి జోకులే పడ్డాయి. ఈ మాటలు చూసే ఫ్యాన్స్‌ హర్టవుతున్నారు. హీరోలు అయి ఉండి మన సినిమాల గురించి అలా మాట్లాడటం కరెక్టా అంటున్నారు. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. స్టేజీ మీద తేజ, రానా వేసిన సెటైర్లు, కౌంటర్లు, కామెంట్లు అన్నీ నిజమే. జరిగినవే వాళ్లు అన్నారు.

కానీ మన టాలీవుడ్‌ జనాలు, ప్రేక్షకుల దగ్గర అలాంటి మాటల్ని తీసుకునే అలవాటు లేదు. బాలీవుడ్‌లో అయితే ఇది చాలా కామన్‌. అయినా స్టేజీ మీద తన గురించి జోకు పడితే.. బాలయ్యే (Nandamuri Balakrishna) నవ్వారు. కాబట్టి సెటైర్లను సెటైర్‌గా తీసుకోవాలి. ఒకవేళ హరీశ్‌ శంకర్‌లా (Harish Shankar) వాళ్ల విషయంలో రియాక్ట్‌ అవ్వొచ్చు.

కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. ‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus