Hiranya Kashyapa: రానా ‘హిరణ్య కశ్యప’ ఊసే లేదు!

టాలీవుడ్ హీరో రానా ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. సురేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమాను ప్లాన్ చేశారు. ‘శాకుంతలం’ సినిమా చేస్తోన్న గుణశేఖర్ ఈ సినిమా విడుదలైన తరువాత ‘హిరణ్య కశ్యప’ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగినట్లు తెలుస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. నిర్మాత సురేష్ బాబు బడ్జెట్ లో సినిమాలు తీస్తుంటారు.

ఆయన కథ బాగా నచ్చితేనే తప్ప భారీ పెట్టుబడులు పెట్టరు. సినిమాలకు సంబంధించిన చాలా సేఫ్ గా బడ్జెట్ ప్లాన్ చేస్తారు. ‘హిరణ్య కశ్యప’ సినిమాకి సంబంధించి ఆయనకు కథపై నమ్మకం కుదరకపోవడం, దర్శకుడు గుణశేఖర్ పెద్ద మొత్తాన్ని కోట్ చేయడంతో సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారట. గుణశేఖర్ రెడీ చేసిన స్క్రిప్ట్ పాత ‘లవకుశ’ రీమిక్స్ మాదిరిగా ఉందని.. అలా కాకుండా మరో స్క్రిప్ట్ ఇచ్చి దాంతో సినిమా చేయమని సురేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది.

దానికి గుణశేఖర్ అంగీకరించలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారని తెలుస్తోంది. ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు.. ఆ సినిమా హిట్ అయితే ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన గనుక నిర్మించకపోతే గుణశేఖర్ సొంతంగా సినిమా చేయాల్సి ఉంటుంది.

మరి ఈ విషయంలో గుణశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ ఈ ప్రాజెక్ట్ ను మాత్రం చేయాలనేది గుణశేఖర్ కల. చారిత్రాత్మక సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ‘శాకుంతలం’ సినిమా కూడా అదే జోనర్ లో తెరకెక్కుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus