పాయల్ రాజ్ పుత్ మోకాలికి ఏమైంది..?

పాయల్ రాజ్ పుత్ సడన్ గా మోకాలికి బ్యాండ్ తో కనిపించారు. నేడు ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ నీక్యాప్ తో కనిపించి ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేశారు. విషయంలోకి వెళితే రవితేజ హీరోగా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా, ఈనెల 24న విడుదల కానుంది. ఫాంటసీ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేడు దర్శకుడు ఆనంద్ తో పాటు, హీరోయిన్స్ నభా నటేష్ మరియు పాయల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షార్ట్ మిడ్డీలో అటెండ్ అయిన పాయల్ మోకాలికి నీక్యాప్ ధరించి కనిపించింది.

మూవీ షూటింగ్ లో పాయల్ గాయపడ్డారా లేక మరేదైనా ప్రమాదంలో ఆమె మోకాలికి గాయమైందా అనే విషయం తెలియాల్సి వుంది. నీక్యాప్ తో ఉన్న పాయల్ ని చూసిన అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పాయల్ ఆర్ డి ఎక్స్ 100 అనే లేడీ ఓరియెంట్ చిత్రంలో నటించారు. ఐతే ఆ చిత్రం ఆమెకు నిరాశే మిగిల్చింది. ఇక వెంకీ మామ చిత్రంలో వెంకీ సరసన హీరోయిన్ గా చేశారు. ఆ చిత్రంలో హిందీ టీచర్ గా పాయల్ బాగానే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ఏంజెల్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఉదయనిధి మారన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ అధియమన్ తెరకెక్కిస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus