Prabhas: ‘సలార్‌’ సెలబ్రేషన్స్‌లో ఆ ఫొటో చూశారా? ఏదో తేడాగా ఉందే?

‘సలార్‌’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఇటీవల ఘనంగా జరిగాయి. సినిమా కోర్‌ టీమ్‌ అందరూ కలసి కేక్‌ కట్‌ చేసుకుని మరీ సరదాగా సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది నెటిజన్లు ఓ విషయాన్ని పట్టి చూసి.. ‘ప్రభాస్‌కి ఏమైంది’ అని ప్రశ్నలు రెయిజ్‌ చేస్తున్నారు. మీరు మరోసారి ఆ ఫొటోలు చూస్తే మీకూ అదే డౌట్‌ వస్తుంది. ముందుగా సలార్‌ సంబరాల సంగతి చూస్తే…

డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమా రూ. 650 కోట్లకుపైగా వసూలు చేసి ఏడాదికి చక్కటి ముగింపునిచ్చింది. ఇంకా సంక్రాంతి వరకు ఈ సినిమాకు రన్‌ అవకాశం ఉండటంతో సినిమా వసూలు ఇంకాస్త పెరుగుతాయి అంటున్నారు. దానికితోడు విదేశాల్లోనూ సినిమాను రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇటీవల ప్రకటించింది. కాబట్టి రూ. వెయ్యి కోట్లు దాటేయడం పెద్ద విషయమేమీ కాదు. ఆ లెక్కలు తర్వాత చూసుకుందాం. అయితే ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఇటీవల నిర్వహించారు.

హీరోలు ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరగందూర్‌, సినిమా నైజాం రైట్స్ తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు ప్రభాస్‌ తన ఎడమచేతితో కుడి భుజాన్ని పట్టుకుని ఉన్నాడు. ఒక్క ఫొటోలో అంటే… బయటికొచ్చిన రెండు ఫొటోల్లోనూ అలానే చేతి సపోర్టు తీసుకున్నాడు. దీంతో ప్రభాస్‌ చేతికి ఏమైంది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం ప్రభాస్‌ (Prabhas) భుజానికి విదేశాల్లో సర్జరీ జరిగిందని వార్తలొచ్చాయి. ఈ విషయంలో అతని నుండి, సన్నిహితుల నుండి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. క్లారిటీలు కూడా ఇవ్వలేదు. ఆ కారణంగానే సినిమా ప్రచారానికి కూడా రాలేదు అని అంటారు. అయితే, ఇప్పుడు ఈ ఫొటో చూసి సర్జరీ నుండి ప్రభాస్‌ పూర్తి స్థాయిలో కోలుకోలేదా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలోనైనా టీమ్‌ నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus