Tollywood Heroes: మన హీరోలకు వరుస సర్జరరీలు… ఎందుకని?

షూటింగ్‌లో గాయపడటంతో ఫలానా హీరోకు సర్జరీ అయ్యింది… ఈ మాట టాలీవుడ్‌లో చాలా అరుదుగా వింటుండే వాళ్లం. ఏదో రిస్కీ షాట్‌ తీసినప్పుడు ఇలాంటివి జరుగుతుండేవి. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో చూస్తే ముగ్గురు స్టార్‌ హీరోలు దగ్గర దగ్గరలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అది కూడా కుడి చేతికే. దీంతో అసలు టాలీవుడ్‌ హీరోలకు ఏమవుతోంది. ఎందుకిలా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది అంటూ చర్చ నడుస్తోంది. టాలీవుడ్‌ స్టార్ల సర్జరీల పర్వం ఇటీవల మొదలైంది మెగాస్టార్‌ చిరంజీవితో అని చెప్పాలి.

ఇటీవల ఓ ప్రెస్‌ మీట్‌లో చిరంజీవి చేతికి కట్టు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. దీంతో ఆయన కంగారు పడొద్దు అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు. కుడి చేత్తో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరి ఉంటుండంతో డాక్టర్‌ను సంప్రదించానని, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రావడంతో సర్జరీ చేశారని చిరంజీవి చెప్పారు. దీంతో 15 రోజులు రెస్ట్‌ తీసుకున్న చిరు నవంబర్ 1 నుండి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా… సుమారు వారం క్రితం నందమూరి బాలకృష్ణ కూడా చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

కొన్ని రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యం చేసి ఇటీవల డిశ్ఛార్జి చేశారు. ఇప్పుడు తారక్‌కు గాయమై.. శస్త్రచికిత్స చేయించుకున్నారనే విషయం బయటికొచ్చింది. దీపావళి సందర్భంగా తారక్‌ తన కొడుకులో ఓ ఫొటో రిలీజ్‌ చేశాడు. అందులో చేతికి కట్టు ఉంది. ఏమైందా అని ఆరా తీస్తే… జిమ్‌లో ఎన్టీఆర్‌ గాయపడ్డాడని, అందుకే చిన్నపాటి శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. దీంతో టాలీవుడ్‌ హీరోలకు వరుస సర్జరీలు చర్చనీయాంశంగా మారాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus