Idli Kadai: ఇటు టాలీవుడ్‌.. అటు శాండిల్‌వుడ్‌.. ‘ఇడ్లీకొట్టు’కి పోటీ మామూలుగా లేదుగా?

‘ఇడ్లీ కడై’ / ‘ఇడ్లీ కొట్టు’ (Idly Kadai) అంటూ కొన్ని రోజుల క్రితం ధనుష్‌ (Dhanush) ఓ సినిమా అనౌన్స్‌ చేశాడు. సొంత దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది అని తెలిసేసరికి ఆ సినిమా ఆసక్తి డబుల్‌, ట్రిపుల్‌ అయింది. ఆ ఆసక్తికర సినిమా ఎలా ఉంటుందో తెలియడానికి మరో ఆరు నెలలు ఆగాల్సిందే. అవును.. ఈ నెల రావాల్సిన సినిమాను ఆరు నెలలు వాయిదా వేశాడు ధనుష్‌. ఈ విషయాన్ని ఇటీవల ఆయన అనౌన్స్‌ చేశాడు.

Idli Kadai

What is Dhanush belief on Idli Kadai movie

అయితే ఆయన చెప్పిన డేట్‌ చూస్తుంటే ధనుష్‌ రిస్క్‌ చేస్తున్నాడు అనిపిస్తోంది. ‘ఇడ్లి కడై’ సినిమాను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆ సమయంలో సౌత్‌ సినిమా పరిశ్రమల్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ వన్’ వస్తోంది. రిషభ్‌ శెట్టి (Rishab Shetty) నుండి రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమా ‘కాంతార’ సినిమా అందించిన విజయం చూశాక ఆ సినిమా ఎఫెక్ట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమాతో క్లాష్ అంటే ఆషామాషీ కాదు. ఇక టాలీవుడ్‌లో అయితే ఒక వారం ముందు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్‌ అవ్వనుంది. ఇక సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా ‘సంబరాల యేటిగట్టు’ (Sambarala Yeti Gattu ) సినిమా కూడా ఆ రోజు రానుంది.

అలాగే అన్నీ అనుకున్నట్లుగా సాగితే ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Rajasaab) కూడా అప్పుడే రావొచ్చు అని అంటున్నారు. అదే జరిగితే ‘ఇడ్లీ కొట్టు’ సినిమాకు భారీ పోటీనే ఉంటుంది. మరి ఇంత పోటీ ఉన్నా ధనుష్‌ తన ‘ఇడ్లీ కొట్టు’ను అప్పుడే తీసుకొస్తామని అనుకుంటున్నారు అంటే సినిమా మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.

బాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ కామెంట్స్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus