Adivi Sesh: వచ్చే ఏడాది మూడు సినిమాలు అని చెప్పిన అడివి శేష్‌.. మూడోది ఏంటి?

2022లో రెండు సినిమాలతో వచ్చిన అడివి శేష్‌(Adivi Sesh).. గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. వరుస సినిమాల తర్వాత గ్యాప్‌ తీసుకోవాలని అనుకోడం వల్లే ఆ గ్యాప్‌ వచ్చింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి వచ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్‌ చేస్తామని చెప్పారు. దీంతో మూడో సినిమా ఏంటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఇంకా అనౌన్స్‌ చేయని ఆ సినిమా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

Adivi Sesh

థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్‌, ఫిక్ష‌న్‌.. ఇలా అన్ని ర‌కాల సినిమాలను చేసుకుంటూ రాణిస్తున్నాడు అడివి శేష్‌. ఆయన ఎంచుకున్న కథలతో హ‌డావుడి లేకుండా వ‌చ్చి, సైలెంట్‌గా హిట్ కొడుతుంటారు. ‘హిట్ 2’ (HIT: The Second Case)  త‌ర‌వాత శేష్‌ క‌నిపించ‌లేదు. ఆ తర్వాత రెండు సినిమాలు ప్రారంభించినా అప్‌డేట్లు అంతగా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. తాజాగా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ను ముగిస్తూ 2025లో మూడు సినిమాల్ని రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

అడివి శేష్‌ ప్ర‌స్తుతం ‘గూఢ‌చారి 2’  (Goodachari 2) , ‘డెకాయిట్‌’ సినిమాల్లో న‌టిస్తున్నాడు. ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు అందరికీ తెలుసు. ఆ సినిమాకు సీక్వెల్‌ కావడంతో ‘గూఢచారి 2’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ పెట్టారు కూడా. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఫలితం మీద ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

దీంతోపాటు ‘డెకాయిట్‌’ అనే మరో సినిమా చేస్తున్నాడు శేష్‌. శ్రుతి హాసన్‌ (Shruti Haasan)  కథానాయికగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు 2025లోనే వ‌స్తాయి. దీంతో ఆ మూడో సినిమా ఏమిటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. శేష్ ఏ సినిమాను ఓకే చేశాడు. రెండు సినిమాలు పారలల్‌గా షూటింగ్‌ జరుగుతుండగా.. ఈ మూడో సినిమా ఎప్పుడు ఓకే చేశారు అనేది చూడాలి.

 హిట్‌ ఇవ్వని పరిశ్రమకు మళ్లీ బేబమ్మ వస్తుందా? ఛాన్స్‌లు వస్తాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus