తెలుగు సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty) .. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఒకవేళ సినిమాకు మంచి ఫలితం వచ్చినా.. ఆమెకు అందులో పెద్ద పాత్ర దక్కలేదు. దీంతో కృతికి లాస్ట్ ఛాన్స్, లాస్ట్ బట్ వన్ అని అలర్ట్‌లు వస్తూనే ఉన్నాయి. అలా ఆమె చేసిన సినిమా ఇప్పుడు మంచి విజయం అందుకుంది. దీంతో ఓ డౌట్ కూడా మొదలైంది.
‘ఉప్పెన’ (Uppena) సినిమా తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy), ‘బంగార్రాజు’ (Bangarraju) సినిమాలు చేసి పర్వాలేదనిపించింది కృతి శెట్టి. కానీ ఆ తర్వాత అస్సలు కలిసి రావడం లేదు. అలా ‘ది వారియర్’ (The Warriorr), ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) , ‘కస్టడీ’ (Custody) , అంటూ వచ్చి దారుణమైన ఫలితాలే అందుకుంది. ఇటీవల ‘మనమే’ (Manamey) చేసినా తేడా కొట్టేసింది. అలాంటి టైమ్‌లో కృతి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా రూపొందిన ‘ఏఆర్ఎం’ అనే సినిమాలో నటించి మెప్పించింది.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చి మంచి విజయమే అందుకుంది. వేరే భాషల్లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు కానీ.. మలయాళంలో సూపర్ హిట్ టాక్ మంచి వసూళ్లు అందుకుంది. దీంతో ఓ డౌట్ కూడా మొదలైంది. ఈ సినిమా తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలున్నాయి అని మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే కృతి తెలుగులోకి ఇక రాదేమో అని అంటున్నారు.
ఎందుకంటే ఆమెకు ఇక్కడ సినిమాలు లేవు. తమిళంలో అయితే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ లెక్కన ఆమె రాకపోయినా ఆమె సినిమాలు వస్తాయి అని చెప్పొచ్చు. కృతి ప్రస్తుతం కార్తి (Karthi) ‘వా వాతియార్’, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, జయం రవి (Jayam Ravi) ‘జీనీ’ ఉన్నాయి. మరి ఈ సినిమాలకు ‘ఏఆర్‌ఎం’ ఫలితం ఎఫెక్ట్ పడి కృతి కెరీర్‌కు మంచి బూస్టింగ్ వస్తుందా అనేది చూడాలి.