Renu Desai: రేణు దేశాయ్.. ఆ పోస్ట్ వెనుక అర్ధమేంటి?

హీరోయిన్ గా తక్కువ కాలం కొనసాగినప్పటికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రేణు దేశాయ్(Renu Desai) . పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan)  కలిసి చేసిన బద్రి (Badri) సినిమా ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా మారిన రేణు, విడాకులతో సెపరేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, పర్యావరణం, జంతు సంక్షేమం అంటూ తన ప్రేమను పంచుకుంతున్నారు.

Renu Desai

ఇటీవల రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియో షేర్ చేయడం చర్చకు దారితీసింది. “ఆధునిక వైద్య శాస్త్రం మన శరీరాన్ని బతికిస్తూ ఉంచుతుంది” అనే క్యాప్షన్ పెట్టిన ఈ వీడియోలో, ఆమె ఏమైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో సెలైన్ ఆమెకే పెడుతున్నారా లేక ఇది వేరే వారిదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేణు దేశాయ్ ఆరోగ్యంపై చర్చించుకుంటున్నారు. అభిమానులు ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, రేణు తన ఆరోగ్యంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఇటీవల రేణు దేశాయ్ బిగ్ స్క్రీన్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రవితేజ (Ravi Teja)  నటించిన టైగర్ నాగేశ్వరరావు  (Tiger Nageswara Rao) చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

ఈ సినిమాతో రేణుకు కొత్త ఆఫర్స్ వస్తున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆమె రెగ్యులర్ పాత్రలకంటే ప్రత్యేకమైన పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆమె తనయుడు అఖిరా నందన్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అఖిరా మొదట మ్యూజిక్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus