Akhil: #SSMB29 గురించి మాట్లాడితే అఖిల్‌ అలా నవ్వాడేంటి.. ఏమైనా ఉందా?

  • April 27, 2023 / 11:41 AM IST

‘ఏజెంట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా అఖిల్‌ అక్కినేని చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కోసం పడ్డ కష్టంతోపాటు… పర్సనల్‌ ముచ్చట్లు కూడా చెబుతున్నాడు. చాలా రోజుల తర్వాత అఖిల్‌ మీడియాకు అందుబాటులోకి రావడంతో… చాలా ప్రశ్నలే వస్తున్నాయి. అందులో కొన్ని ఆసక్తికరంగా కూడా ఉంటున్నాయి. వాటికి తగ్గట్టుగానే అఖిల్‌ కూడా ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో #SSMB29 సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు అఖిల్‌ రెస్పాన్స్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది.

ఇటీవల అఖిల్‌ (Akhil) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్నపాటి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోనే రాజమౌళి – మహేష్‌బాబు సినిమా గురించి మాట్లాడాడు. ‘‘మహేశ్‌బాబుతో చేయబోతోన్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తావా? అని రాజమౌళి అడిగితే మీరేం చేస్తారు?’’ అని యాంకర్‌ అడగ్గా అఖిల్‌ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా అనిపించింది. అయితే ఆ సమాధానంలో అభిమానులు తమకు నచ్చిన సమాధానాలు వెతుక్కుంటున్నారు. అందుకే ఈ చర్చ మొదలైంది.

ఆ ప్రశ్నకు ‘‘రూమర్స్‌ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పండి. వారిద్దరు నా కుటుంబ సభ్యుల్లాంటివారు. అయినా రాజమౌళి సినిమాకి ఎవరైనా నో చెబుతారా చెప్పండి’’ అంటూ అఖిల్‌ నవ్వేశాడు. దీంతో అఖిల్‌కి అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాడని కొందరు, అఖిల్‌ను ఛాన్స్‌ వచ్చిందేమో అని మరికొందరు డిస్కస్ చేస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటం పెద్ద కొత్తేం కాదు. కాబట్టి ఓ పాత్ర కోసం అఖిల్‌ను అడిగితే చేసేస్తారేమో అంటున్నారు.

ఇక #SSMB29 సంగతి చూస్తే.. ప్రస్తుతం రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ పని మీద ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రచారం పనులు ఇటీవల పూర్తి చేసుకున్న రాజమౌళి అండ్‌ కో. ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో కూర్చుంటారట. మహేష్‌ – త్రివిక్రమ్‌సినిమా పూర్తయ్యేసరికి రాజమౌళి రెడీగా ఉంటారు అని సమాచారం. ప్రపంచ సాహసికుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని కోసం హాలీవుడ్‌ సంస్థలతో రాజమౌళి టైప్‌ అప్‌ అవుతున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus