ఒక సినిమా హిట్టవ్వాలంటే అందుకు ప్రధాన కారణం దర్శకుడి మేకింగ్. గత 15 ఏళ్లలో మన దర్శకులు ఎంతగానో అప్గ్రేడ్ అయ్యారు. ప్రస్తుతం టాప్ దర్శకులపై ఒక లుక్కేస్తే.. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఎప్పటి నుంచో నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు ఎస్ఎస్. రాజమౌళి. ఆయన తరువాత కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి వారు ఇప్పటివరకు అపజయం లేని వారిగా కొనసాగుతున్నారు. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ అయితే అపజయాలు వాచ్చినా కూడా తన స్థాయిని తగ్గించుకోవడం లేదు.
అల వైకుంటపురంలో సినిమాతో అయన 200కోట్ల మార్కెట్ ను ఈజీగానే టచ్ చేశారు. అనంతరం సుకుమార్, క్రిష్ వంటి వారు ఇంటిలిజెంట్ మైండ్ గేమ్ సినిమాలతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేస్తుండగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్న డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైగర్ తో మరో స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక వీరి తరువాత సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, వివి.వినాయక్ వంటి సీనియర్స్ ఒక పవర్ఫుల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని వారి స్టైల్ లో హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలను టార్గెట్ చేస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల, పరశురామ్ కూడా ఇప్పుడు వారి బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.