OG: రిమోట్‌తో సుజీత్‌ రెడీ.. పవన్‌ రాకే ఆలస్యం… వస్తే ఈసారి నెలలే అట!

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ఇటీవల కాలంలో అత్యంత వేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమా ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ‘ఓజీ’ అనే చెప్పాలి. సినిమాకు ఇంకా పేరు పెట్టకపోయినా ఈ షార్ట్‌ ఫామ్‌తోనే నడిపిస్తున్నారు అంతా. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందంటే ఈ సినిమా స్పీడ్‌ను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. అసలు దర్శకుడు సుజీత్‌ ఇంత త్వరగా ఎలా షూట్‌ చేయగలుగుతున్నారు. ఇక నిర్మాత దానయ్య వరుసగా కాల్‌షీట్లు ఎలా పొందగలుగుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌ చూస్తే ‘ఓజీ’ (OG) కంటే ముందు అనౌన్స్‌ చేసిన సినిమాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. క్రిష్‌ ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి ఏంటో అర్థమే కావడం లేదు. హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అయితే ఇదిగో అదిగో ఫొటోలు వస్తున్నాయి తప్ప సినిమా షూట్‌ స్టార్ట్‌ అవ్వడం లేదు. కానీ సుజీత్‌ మాత్రం కామ్‌గా సినిమా షూటింగ్‌ కానిచ్చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం త్వరలో ఈ సినిమా ఆనాలుగో షెడ్యూల్‌ స్టార్ట్‌ అవ్వడమే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీ ఉన్నాడు. దీంతో ఆయన అవసరం లేని సన్నివేశాలను సుజీత్ చకచకా తీసేస్తున్నారట. అందుకే త్వరగా సినిమా పూర్తి చేసేస్తున్నారు అని టాక్‌. ప్రస్తుతం మొదలైన నాలుగో షెడ్యూల్‌లో త్వరలో పవన్‌ వచ్చి చేరతారట. అప్పుడే మొత్తం టీమ్‌ మీద కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయి అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే… పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా అరుళ్‌ మోహన్ నటిస్తోంది.

ఇక మిగిలిన పాత్రల్లో కీలక నటులను తీసుకొస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి, శ్రియ రెడ్డి, అర్జున్‌ దాస్‌.. ఇలా ఆసక్తికర నటులను సినిమాలోకి తీసుకుంటున్నారు. దీంతో సినిమా మీద బజ్‌ భారీగా పెరుగుతోంది. అన్నట్లు సినిమాకు ‘ఓజాస్‌ గంభీర’ అనే పాత్రలో పవన్‌ కనిపిస్తాడని టాక్‌. ఆ పేరు షార్ట్‌ ఫామ్‌నే టైటిల్‌గా పెడుతున్నారట.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus