KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

ఓ సినిమాపై ఆడియన్స్ అటెన్షన్ ఏర్పడాలి అంటే కచ్చితంగా టైటిల్ ప్రధానం. అందులో ఎలాంటి డౌట్ లేదు. టైటిల్ జనాల్లోకి వెళితేనే… మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవుతుంది. బయ్యర్స్ దృష్టిని ఆకర్షించేది కూడా ఇదే. అలాగే టైటిల్ ఎవ్వరినీ నొప్పించే విధంగా కూడా ఉండకూడదు. అయితే ఇప్పటి సినిమాల టైటిల్స్ ను కనుక గమనిస్తే.. ఈ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నట్లు అస్సలు కనిపించడం లేదు.

KRamp

యూత్ అటెన్షన్ కోసం సోషల్ మీడియాలో వాడే అసభ్యకరమైన డైలాగులను టైటిల్స్ గా పెట్టేస్తున్నారు. ఈ మధ్యనే ‘వర్జిన్ బాయ్స్’ అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. దాని ఫలితం ఎలా ఉన్నా టైటిల్ అయితే హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు చూసుకుంటే.. కిరణ్ అబ్బవరం ‘K -RAMP’ అనే సినిమా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆ పదానికి ఎలాంటి అర్ధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘రాజావారు రాణిగారు’ ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ‘ నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఇలాంటి అచ్చమైన, స్వచ్ఛమైన టైటిల్స్ తో సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం…’K-RAMP’ అనే డబుల్ మీనింగ్ టైటిల్ తో సినిమా చేయాలా? ఇదిలా ఉంటే.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో ఓ సినిమా వస్తుంది. దానికి ‘BADASS’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దానికి కూడా సోషల్ మీడియాలో వేరే అర్థం వచ్చేలా మాట్లాడుకుంటారు.

సిద్ధు, రవికాంత్..ల కాంబోలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే మంచి టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. కానీ రెండో సినిమాకి ‘BADASS’ అనే ఆడ్ టైటిల్ పెట్టుకోవాలా? మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలకి ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. వేరే భాషల్లోని సినిమాలకి తెలుగు టైటిల్స్ పెట్టడం లేదని తెలుగు యువత మారాం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా మన ఫిలిం మేకర్స్ దృష్టిలో పెట్టుకుంటే.. మన సినిమాలకి మంచి టైటిల్స్ పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది.

24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus