Sukumar: ‘వ్యాక్సిన్‌’ సినిమాలో సుకుమార్‌ పాత్ర ఏంటో..!

వివేక్‌ అగ్నిహోత్రి – సుకుమార్‌ కలసి దిగిన ఓ ఫొటో ఇటీవల సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన విషయం తెలిసిందే. రెండు భిన్న ధ్రువాల్లాంటి ఈ ఇద్దరూ కలసి ఏం సినిమా చేస్తారు, అసలు కలిసింది సినిమా కోసమేనా అనే మాటలు వినిపించాయి. ఆ పోస్టు పెట్టి వివేక్‌ అగ్నిహోత్రి ఏమన్నా చెప్పారా? అంటే లేదనే చెప్పాలి. ఆ తర్వాత సినిమా చేస్తున్నాం అని హింట్‌ ఇచ్చి, దేని గురించి చేస్తున్నారో చెప్పలేదు. ఇప్పుడు పేరు చెప్పారు కానీ.. ఇంకో విషయం పెండింగ్‌లో పెట్టేశారు.

అప్పటికే వైవిధ్యమైన దర్శకుడిగా పేరున్న వివేక్‌ అగ్నిహోత్రి.. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతో ఫైర్‌ బ్రాండ్‌ దర్శకుడిగా మారారు. అలాంటాయన తన తర్వాతి సినిమాగా ఏం చేస్తారు అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ‘కశ్మీర్ ఫైల్స్‌’తో దేశంలో రెండు వర్గాల మధ్య జరిగిన మరచిపోవాల్సిన విషయాన్ని బయటకు తీసి, అప్పుడేం జరిగింది అనే విషయాన్ని నేటితరానికి తెలియజేశారు. ఇప్పుడు ఇటీవల జరిగిన అంశాన్నే సినిమాగా చేయబోతున్నారు. అదే ‘వ్యాక్సిన్‌ వార్‌’.

‘ది వ్యాక్సిన్‌ వార్‌’ అనే సినిమా పోస్టర్‌ను ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. వ్యాక్సిన్ల కోసం మన దేఅం సాగించిన పోరులోని వాస్తవ విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. పల్లవి జోషి, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కరోనా పరిస్థితులపై అలుపెరుగని పోరాటం చేసిన వైద్య ప్రపంచం, శాస్త్రవేత్తలకు నివాళిగా ఈ చిత్రం నిలుస్తుంది’’అని పల్లవి జోషి చెప్పారు. ఇక ‘వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాను 11 భాషల్లో తెరకెక్కిస్తారట.

అలాగే ఆగస్టు 15, 2023న ఈ సినిమానువ విడుదల చేస్తారట. ఇంతకుమించిన వివరాలేవీ చిత్రబృందం ప్రకటించలేదు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి చెబుతారు. అయితే ఈ సినిమాకు మొన్నీమధ్య వివేక్‌ అగ్నిహోత్రి, సుకుమార్‌ కలిసిన విషయానికి సంబంధం ఉందా లేదా అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఈ పోస్టర్‌లో ఎక్కడా సుకుమార్‌ పేరు కనిపించలేదు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus