Tollywood: నాలుగో నెలలో సినిమాలు సమ్మగుంటాయా.. సుర్రుమనిపిస్తాయా?

  • April 3, 2023 / 11:54 AM IST

సూరీడు నడినెత్తిన భగ్గున మండుతుంటే.. థియేటర్లలో కూర్చుని సినిమాలు చూడటం మనకు అలవాటు. ఇది ఇప్పటి సరదా కాదు.. గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్‌ జనాలకు ఇది బాగా అలవాటు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్‌ టైమ్‌లో సూపర్‌ కూల్‌ సినిమాలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. మరీ స్టార్‌ హీరోలు ఈ సారి బరిలో లేరు కానీ.. ప్రామిసింగ్‌ హీరోలు, ఫామ్‌లో ఉన్న హీరోలు అయితే వస్తున్నారు. దీంతో ఈ సమ్మర్‌లో సినిమాలు ఎలా ఉంటాయి, ఏమవుతాయి అనే చర్చ అయితే సాగుతోంది.

మూడో నెల ఆఖరులో వచ్చిన నాని ‘దసరా’ జోరు నాలుగో నెలలో కచ్చితంగా ఉంటుంది. సినిమాకు వచ్చిన టాక్‌ బట్టి చూస్తే ఈ నెలలో ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటాం అని చెప్పొచ్చు. ఆ తర్వాత మాస్‌ మహరాజ్‌ వచ్చేస్తున్నాడు. ‘రావణాసుర’ సినిమాతో మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా విడుదలవుతోంది. సుధీర్‌ వర్మ రూపొందించిన ఈ సినిమా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ అని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి.

అలాగే తొలి వారంలో కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’, మురుగదాస్‌ ‘ఆగస్టు 16, 1947’ కూడా సిద్ధంగా ఉన్నాయి. తొలి సినిమా మీచ అంచనాలు లేవు.. కానీ మైత్రీ మూవీ మేకర్స్‌ హ్యాండ్‌ ఉండటంతో కాస్త ఓకే. రెండో సినిమా మీద భారీగా ఉన్నాయి. అయితే ఆ డబ్బింగ్‌ మూవీ ఎంతవరకు ఎక్కుతుంది అనేది చూడాలి. ఇక రెండో వారంలో సమంత – గుణశేఖర్‌ – దిల్‌ రాజుల ‘శాకుంతలం’ సినిమా వస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మరి సమంత ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే ఇదే వారంలో లారెన్స్ ‘రుద్రుడు’ కూడా వస్తుంది. ఈ సినిమా విషయంలో పెద్దగా బజ్‌ లేదు అని చెప్పాలి. మూడో వారంలో సాయితేజ్ ‘విరూపాక్ష’ రిలీజ్‌ చేస్తున్నారు. సుకుమార్ హ్యాండ్‌ ఈ సినిమాలో ఉండటం, అతని శిష్యుడు దర్శకత్వం కావడంతో నమ్మకాలు బాగానే ఉన్నాయి. ఆ వారమే దగ్గుబాటి అభిరామ్‌ ‘అహింస’, కార్తికేయ ‘బెదురులంక’ వస్తాయి అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు.

ఇక ఆఖరి వారంలో ‘పొన్నియన్ సెల్వన్ 2’ వస్తుంది. తొలి పార్టు మంచి విజయం అందుకుంది. అయితే తెలుగులో (Tollywood) ఆశించిన విజయం దక్కలేదు. మరి రెండో పార్టు ఏమవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు పోటీగా అఖిల్‌ – సురేందర్‌ రెడ్డి ‘ఏజెంట్’ వస్తున్నాడు. ఈ సినిమా ప్రచారం మొదలుపెట్టాల్సి ఉంది. ఈ సినిమాతోపాటు వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా రావొచ్చు అంటున్నారు కానీ.. క్లారిటీ లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus