Mahesh Babu: మహేష్ అభిమానుల ట్రోలింగ్ బాగానే ఉంది.. కానీ వాటి సంగతేంటి..!

  • May 23, 2023 / 08:18 PM IST

ఈరోజు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు.ఓ సీనియర్ రిపోర్టర్ ను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం చాలా మందికి తెలిసే ఉంటుంది. ‘మహేష్ సుకపురుషుడు.. అస్సలు కష్టపడడు’ అన్నట్టు ఆ సీనియర్ రిపోర్టర్ చేసిన ప్రచారం. అక్కడితో అతను ఆగలేదు మహేష్ ‘ఎండలో షూటింగ్ చేయలేడు, మహర్షి లో గేదెల సీన్ ఉంటే.. అది కూడా ఎసి ఫ్లోర్ లో చేశాడు’ అని అభిమానులకు మంటపెట్టాడు. అలాగే రాజమౌళితో మహేష్ చేస్తున్న సినిమాకి మహేష్ అంత కష్టపడగలడా.. ? లేక మోషన్ క్యాప్చర్ సినిమా చేసేసి చేతులు దులిపేసుకుంటాడా? అని కూడా ఆ సీనియర్ రిపోర్టర్ తన మనసులో ఉన్నది బయటపెట్టాడు.

దీనికి మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ కంట్రోల్ తప్పి ఇష్టమొచ్చినట్టు ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఎమోషన్ కు లాజిక్స్ ఉండవు కాబట్టి ఓకే. కానీ అసలు నిజం ఏంటి? ఇదే మహేష్ ‘స్పైడర్’ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తూ కాలు విరగొట్టుకున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో కూడా తన కాలుకి సర్జరీ జరిగినా రెచ్చిపోయి ఎడారి ఫైట్ లో నటించాడు. ‘మ మ మహేషా’ పాటలో కూడా తన ఎనర్జీకి మించిన స్టెప్పులే వేశాడు. త్రివిక్రమ్ సినిమా అంటే మహేష్ ఇంకా ఎక్కువ ఎనర్జీతో పనిచేస్తాడు.

‘ఖలేజా’ లో చూసాం.. మే 31 కి కొత్త సినిమా విషయంలో కూడా ఓ క్లారిటీ వస్తుంది. మరి ఆ రిపోర్టర్ బాధ ఏంటి? ఎలాంటి స్టార్ హీరో లేదా హీరోయిన్ అయినా సరే తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. లేకపోతే ఆ సినిమా పై పగబట్టేస్తాడు అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పై ఇతను చేసిన నెగిటివ్ కామెంట్లు ఇండస్ట్రీలో మరెవ్వరూ చేయలేదు అని అంతా చెప్పుకున్నారు. మొన్నటికి మొన్న ‘శాకుంతలం’ సినిమా టైంలో సమంత ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని..ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో ‘మీది తెలుగు సినిమానా.. హిందీ సినిమానా?’ అంటూ ఎటకారంగా ప్రశించాడు.

‘వాల్తేరు వీరయ్య’ టైంలో చిరంజీవి ఇంటర్వ్యూ కోసం ‘ఎంత బ్రతిమిలాడాడో’ అంటూ చిరు టీం ఓపెన్ గా చెప్పింది.’సర్కారు వారి పాట’ టైంలో మహేష్ ఇంటర్వ్యూ కోసం కూడా ఇలాగే ఎంతో బ్రతిమిలాడాడట ఆ రిపోర్టర్. కానీ మహేష్ కరగలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ టైంలో రాజమౌళి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అందుకే ఇద్దరి కొత్త ప్రాజెక్టు పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు అని అంతా భావిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మహేష్ అభిమానుల ట్రోలింగ్ ను ఇంకా ఎంజాయ్ చేస్తాడు కానీ.. దిగొచ్చే రకమైతే కాదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూద్దాం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus