Kamal Hassan: కమల్‌ హాసన్‌ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!

సినిమాలు, రాజకీయం… రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం. అందుకేనేమో ఒకదానికి విరామం ఇచ్చి మరొకటి చేస్తుంటారు మన హీరోలు. కేవలం రాజకీయం అయితే ఓకే కానీ, పార్టీ పెట్టి గెలవాలంటే కష్టమే. ఇటీవల కాలంలో ఇది రెండుసార్లు నిరూపితమైంది.రెండేళ్ల క్రితం పవన్ అలా దెబ్బతినగా, ఇటీవల కమల్‌ హాసన్‌ పరిస్థితీ ఇంతే. దీంతో తిరిగి పరిశ్రమలోకి వచ్చి సినిమాలు చేసుకుంటున్నారు. పవన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రస్తుతానికి సాఫీగా సాగిపోతోంది. అయితే కమల్‌కు అలాంటి పరిస్థితి ఉండేలా కనిపిచండం లేదు.

‘ఇండియన్‌ 2’ సినిమా మధ్యలో ఆపేసి రాజకీయాల్లోకి వచ్చారు కమల్‌ హాసన్‌. ఆపేయడం అనకుండా … ఆగిపోయాక అనడం బెటరేమో. చాలా రకాల కారణాల వల్ల ‘ఇండియన్‌ 2’ ఆగిపోతూ వచ్చింది. అయితే ఇటీవల నిర్మాతలు కోర్టుకెళ్లి సినిమా షూటింగ్‌ ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ క్రమంలో కమల్‌ ‘విక్రమ్‌’ అనే మరో సినిమా ఓకే చేసుకున్నారు. ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ ఉండదేమో అనుకుని ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు డేట్స్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ మొదలవ్వబోతోంది. దీంతో కమల్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అయిపోయిందంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

‘ఇండియన్‌ 2’కి కమల్‌ ఇచ్చిన డేట్స్‌ ఎప్పుడో అయిపోయాయి. కానీ సినిమా ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది అంటే తిరిగి బల్క్‌లో డేట్స్‌ ఇవ్వాల్సిందే. అంటే ‘విక్రమ్‌’ ఇంత త్వరగా మొదలవ్వదు. పోనీ రెండూ ఒక్కసారే చేద్దాం అనుకుంటే సహకరించదు. ‘ఇండియన్‌ 2’ లుక్‌, మేకప్‌ ‘విక్రమ్‌’కి సరిపడవు. సో రెండు సినిమాల మధ్యలో కమల్‌ చిక్కుకున్నారు. మరి దీనిని కమల్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus