Sujeeth: ‘సాహో’ తర్వాత సుజీత్‌ సప్పుడు లేదేంటో

‘రన్‌ రాజా రన్‌’ అంటూ టాలీవుడ్‌లో కొత్త రకం సినిమాను తీసుకొచ్చాడు సుజీత్‌. మరీ కొత్త అని కాదు… అప్పటివరకు కామెడీ, క్రైమ్‌ కామెడీ అంటే ఒకే రకం అలవాటుపడ్డ జనాలకు డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సరికొత్త సినిమా చూపించాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి సినిమా చేసే ఛాన్స్‌ కొట్టేశాడు. చిన్న సినిమాగా మొదలైన ‘సాహో’ … ‘బాహుబలి’ ఎఫెక్ట్‌తో పాన్‌ ఇండియాగా మారి… భారీ చిత్రం అయ్యి కూర్చుంది. అలాంటి సినిమా ఇచ్చిన సుజీత్‌ ఇప్పుడేం చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.

నిజానికి చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ ఛాన్స్‌ సుజీత్‌కి వచ్చింది. అయితే ఆ కథను సుజీత్‌ చిరంజీవికి నచ్చినట్లుగా మలచలేకపోయాడనే పుకార్లు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఆ సినిమా ఛాన్స్‌ కోల్పోయాడు. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలకు కథలు చెప్పాడు. అవేవీ వర్కౌట్ అవ్వలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ సినిమాను డైరెక్ట్‌ చేస్తాడని కూడా వార్తలొచ్చాయి. అది కూడా ఓకే అవ్వలేదు. దీంతో అసలు సుజీత్‌ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మొదలైంది.

రెండు మంచి హిట్లు అందించిన సుజీత్‌ ఖాళీగా ఉండటమేంటి అనే ప్రశ్న కూడా వస్తోంది. ప్రస్తుతం సుజీత్‌ ముంబయిలో ఉన్నాడని సమాచారం. అక్కడ తన టీమ్‌తో ఓ సినిమా కథ పని మీద కూర్చున్నాడని అంటున్నారు. అయితే కన్నడ స్టార్‌ సుదీప్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇందులో తొలి టాక్‌కే ఓటేయొచ్చు అంటున్నారు. తెలుగు హీరోలు అంతా హ్యాండ్‌ ఇస్తున్న నేపథ్యంలో డైరెక్ట్‌గా బాలీవుడ్‌ హీరోతోనే సినిమా చేద్దాం అనుకుంటున్నాడట. దాని కోసమే ప్రయత్నాలు అని తెలుస్తోంది.

ప్రభాస్‌కి సుజీత్‌ అంటే చాలా గురి. అందుకే రెండు సినిమాలు యూబీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద చేసే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మరో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇద్దామన్నా అక్కడ ప్రభాస్‌ ఖాళీగా కూడా లేడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుజీత్‌కి హీరో దొరకాలి, ఆ హీరోకి కథ నచ్చాలి. సినిమా ముందుకెళ్లాలి. చూద్దాం సుజీత్‌ నెక్స్ట్‌ హీరో ఎవరవుతారో.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus