సినిమాలో ఓ సీన్ బాగా పేలాలి అంటే హీరో నటన.. డైరెక్టర్ టేకింగ్ మాత్రమే కాదు ఓ సహాయ నటుడు కూడా చాలా అవసరం. కథని మలుపు తిప్పి … చివరికి ఎండింగ్ కు దారి చూపించే పాత్రలు ఇవే అవుతాయి. సరే హీరోని బాగా హైలెట్ చెయ్యాలి అంటే దీటైన విలన్ కూడా ఉండాలి. అలా అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే అనుకుంటే.. తరువాత రావు గోపాల్ రావు గారి కొడుకు రావు రమేష్ కూడా వచ్చాడు. ఇప్పుడు జగపతి బాబు కూడా నేనున్నాను అంటూ ముందుకు సాగుతున్నాడు.
అయితే ఇలాంటి ఆర్టిస్ట్ లను స్టార్ డైరెక్టర్ ల సినిమాల్లో చూడాలి అని చాలా మందికి ఉంటుంది. గతంలో ప్రకాష్ రాజ్ ను రాజమౌళి ఎందుకు తీసుకోవడం లేదు అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు . ఆ టైములో ‘విక్రమార్కుడు’ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చేసి జక్కన్న ఆ కామెంట్స్ కు బ్రేక్ వేసేసాడు. తరువాత మళ్ళీ రాజమౌళి సినిమాలో ప్రకాశ్ రాజ్ కనిపించలేదు. కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు సుకుమార్ – రావు రమేష్ విషయంలో కూడా అలాంటి డిస్కషన్ లు నడుస్తున్నాయి.
రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి కూడా ఇతన్ని ‘మగధీర’ ‘మర్యాదరామన్నా’ వంటి చిత్రాల్లో వాడుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, కొరటాల ఇలా అందరు స్టార్ డైరెక్టర్ లు రావు రమేష్ ను తమ సినిమాల్లో పెట్టుకున్నారు. కానీ మన లెక్కల మాష్టారు సుకుమార్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా పెట్టుకోలేదు. దీని వెనుక అసలు కారణం ఏంటి. వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా… ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప’ చిత్రంలో అయినా రావు రమేష్ కు .. సుక్కూ ఛాన్స్ ఇస్తాడా అనే డిస్కషన్లు జరుగుతున్నాయి. మరి సుకుమార్ మనసులో ఏముందో…!
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!