Pushpa 2: ₹1400 కోట్లు దాటేసిన ‘పుష్ప 2’.. ఇండియన్‌ రికార్డుకు జస్ట్‌ 6 వేల కోట్లే..!

ఇండియన్‌ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటే మనకు ప్రస్తుతం ‘దంగల్’ సినిమానే. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)  నటించిన ఈ హిందీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకుపైగానే వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ది (Baahubali 2) . అయితే ఇప్పుడు ఈ స్థానాలు మారబోతున్నాయా? ఏమో ‘పుష్ప: ది రూల్‌’ టీమ్‌ జోరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. విడుదలైన తొలి ఆరు రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రూ.2000 కోట్లవైపు అడుగులేస్తోంది.

Pushpa 2

అల్లు అర్జున్‌ (Allu Arjun)  హీరోగా సుకుమార్‌  (Sukumar) తెరకెక్కించిన ఈ సినిమా 15వ తేదీ నాటికి అంటే 11 రోజులకు రూ. 1400 కోట్లు వసూళ్లు సాధించింది. రోజుకు సుమారుగా రూ.100 కోట్ల గ్రాస్‌ వసూళ్లు ఈ సినిమా అందుకుంటోంది. ఇండియన్‌ సినిమాలో ఇప్పటికిప్పుడు పెద్ద సినిమా రిలీజ్‌లు లేవు. దీంతో మరో వారం వరకు ఈ సినిమాకే వసూళ్లు అని ఫిక్స్‌ అవుతున్నారు. ఆ లెక్కన రూ. 2000 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు అని అంటున్నారు. జస్ట్‌ రూ.600 కోట్లే కదా అనేది ఇక్క లెక్క.

అదేంటి జస్ట్‌ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ చెబుతున్న వసూళ్ల లెక్కలు, రిలీజ్‌ చేస్తున్న పోస్టర్లు చూస్తే రూ. 600 కోట్లు పెద్ద విషయమేమీ కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఇప్పటికే రూ.550 కోట్ల+ వచ్చాయి. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా చెబుతున్నారు. మరోవైపు, ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  3డీ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో ఈ వెర్షన్‌లో సినిమా చూడొచ్చని టీమ్‌ తెలిపింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే టికెట్‌ రేట్లు కూడా తగ్గాయి. కాబట్టి మరోసారి థియేటర్‌లో ‘పుష్ప’రాజ్‌ హంగామా చూద్దామని ప్రేక్షకుడు వెళ్తే.. వసూళ్ల పోస్టర్‌లో రూ. 2000 కోట్ల మార్కు చూడొచ్చు.

10 రూపాయల టికెట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి.. నటిపై ట్రోలింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus