Pushpa 2 The Rule: 10 రూపాయల టికెట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి.. నటిపై ట్రోలింగ్

అల్లు అర్జున్  (Allu Arjun) , రష్మిక మందన్న (Rashmika Mandanna)  హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప-2 (Pushpa 2 The Rule) సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని మామూలు ఆడియన్సే కాదు సెలబ్రిటీలు కూడా పనికట్టుకుని వెళ్లి మరీ చూస్తున్నారు. అంతేకాదు పెద్ద పెద్ద రివ్యూలు కూడా రాసేస్తున్నారు. ఇంత గొప్ప సినిమా చూడటం మంచి అనుభూతిని కలిగించిందని చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ త‌మిళ న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంయుక్త ష‌న్‌ముఘ‌నాథ‌న్ మాత్రం ఒక విచిత్రమైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.

Pushpa 2 The Rule

ఆమె తాజాగా ఓ వింత ట్వీట్ వేసింది. ఈ ముద్దుగుమ్మ తన ట్వీట్‌లో “మేం నిన్న ఫీనిక్స్ మాల్‌లో పుష్ప 2 సినిమాకి చూసేందుకు వెళ్లాం. పుష్ప చీర కట్టుకొని డాన్స్ చేయడం మొదలు పెట్టగానే, మా పక్కన ఉన్న ఆవిడకి ‘స్వామి’ పూనినట్లు, ఊగిపోవడం మొదలు పెట్టింది, నోట్లోంచి నాలుక బయటకు చాపింది, వాళ్ళ ఆయన ఆమెను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కానీ ఆమె అలా ఊగిపోతుంటే మాకు చాలా భయం వేసింది, అందుకే మేం రూ.10 (ముందు) సీటుకి మారిపోయాం.” అని చెప్పుకొచ్చింది.

అయితే ఆమె ట్వీట్ లో ఒక మిస్టేక్ ఉండటం వల్ల ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చాలామంది యూజర్లు పది రూపాయలు టికెట్ ఎక్కడుంది? నువ్వే కాలంలో ఉన్నావ్, 90s లోనే ఉన్నావా అని ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో 60 రూపాయల ధర నుంచే మూవీ టికెట్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అటెన్షన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయవద్దని మరికొంతమంది ఆమెకు చురకలంటించారు. ఫీనిక్స్ మాల్‌లో టెన్ రుపీస్ టికెట్ అమ్మరని, అది ఎప్పుడో రద్దు అయిపోయిందని మరి కొంతమంది అన్నారు.

దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ కోసం మరో రిస్క్ తప్పట్లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus