RRR Release Date: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త డేట్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందో!

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఉగాది 2022కి విడుదల కానుందని సమాచారం. అయితే రాజమౌళి మాత్రం కొత్త డేట్ గురించి చెప్పడం లేదు. అక్టోబర్ 13 నుంచి సినిమాను వాయిదా వేశామని కూడా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆయన చెప్పకపోయినా ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉండడంతో అక్టోబర్ 8, 13 తేదీలకు పలు చిన్న సినిమాలు డేట్ ని ఖరారు చేసుకుంటున్నాయి.

మొదట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జూలై 30, 2020లో విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్ కాస్త జనవరి 8, 2021కి వెళ్లింది. కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో మరోసారి విడుదల తేదీని మార్చకతప్పలేదు. కొత్త డేట్ అక్టోబర్ 13, 2021 అని అధికారికంగా అనౌన్స్ చేసింది చిత్రబృందం. కానీ ఈ డేట్ కి కూడా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేయరని ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. కానీ ఆ డేట్ కి కచ్చితంగా వస్తామన్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.

‘దోస్తీ’ అనే పాటను రిలీజ్ చేయడం.. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించడంతో దసరాకు సినిమా వస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజమౌళి తన సినిమా డేట్ ని 2022కి మార్చడానికి అంగీకరించారు. మరి ఈ విషయం గురించి ఆయన నోరు విప్పి ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాలి!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus