మనసులో మాట బయటపెట్టిన నాగ్‌ హీరోయిన్‌

  • March 28, 2021 / 05:09 PM IST

ఎవరన్నా హీరోయిన్‌ని మీకే హీరో ఇష్టం అంటే టాలీవుడ్‌ నుండి ఇద్దరు, బాలీవుడ్‌ నుండి ఓ ఇద్దరి పేర్లు చెబుతారు. మరి ఎవరెవరితో పని చేయాలనుంది అని అడిగితే ఓ ఇద్దరు హీరోలు, ఇద్దరు దర్శకులు పేర్లు చెబుతారు. అలా ‘వైల్డ్‌ డాగ్‌’ భామ సయామీ ఖేర్‌ను ఇటీవల మీడియా ఇదే తరహా ప్రశ్న వేసింది. మీకెవరెవరితో పని చేయాలనుంది అడిగితే.. పెద్ద లిస్ట్‌ అయితే చెప్పుకొచ్చింది. అయితే తొలి సినిమాకి, రెండో సినిమాకి ఏళ్ల గ్యాప్‌ ఇచ్చిన ఆ నాయిక, ఆ లిస్ట్‌ ఎప్పటికి పూర్తి చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్న.

సాయిధరమ్‌తేజ్‌ తొలి చిత్రం (టెక్నికల్‌గా) ‘రేయ్‌’తో టాలీవుడ్‌కి పరిచయమైంది సయామీ ఖేర్‌. 2015లో విడుదలైన ఆ సినిమా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సయామీ మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు. ఆమెకు అవకాశాలు రాలేదా? ఆమెనే అందుబాటులో లేదా అనేది పక్కనపెడితే… మళ్లీ రెండో సినిమా చేయడానికి ఆరేళ్లు పట్టింది. అదే ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా త్వరలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సయామీ మట్లాడుతూ రాజమౌళి అంటే ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ప్రభాస్‌, అల్లు అర్జున్‌తో నటించాలి. మణిరత్నం, తరుణ్ భాస్కర్‌తో పనిచేయాలని ఉంది అని చెప్పుకొచ్చింది.

తొలి రెండు సినిమాలకే ఆరేళ్లు గ్యాప్‌ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులు మరచిపోతున్ సమయంలో వచ్చిన సయామీ… ఆమె కోరికలు ఎప్పటికి తీర్చుకుంటుందో మరి. ఇక్కడే ఉంటూ, అవకాశాలు సంపాదించడం పెద్ద కష్టం కాదు అంటుంటారు టాలీవుడ్‌ జనాలు. కొత్త అందాల్ని మన తెలుగు సినిమా జనాలు బాగానే ఆదరిస్తారు. అయితే ‘వైల్డ్ డాగ్‌’లో మొత్తం యాక్షనే అంటోంది సయామీ. అది చూసి… ఆమె చెప్పిన రాజమౌళి, మణిరత్నం, తరుణ్‌ భాస్కర్‌ అవకాశాలు ఇస్తారంటారా?

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus