Chiru, Radha: చిరు – రాధిక సినిమా ఎప్పుడు? అనౌన్స్‌ చేస్తారా?

ఏడు నెలల క్రితం అనుకుంటా.. చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ, అనౌన్స్‌ చేస్తూ బిజీగా ఉన్న రోజులవి. ఆ సమయంలో ‘చిరంజీవి మాకో సినిమా చేస్తా అన్నారు’ అంటూ ప్రముఖ నటి రాధిక మీడియాతో చెప్పారు. రాడాన్‌ బ్యానర్‌ మీద ఈ సినిమా ఉంటుంది అని కూడా చెప్పారామె. అయితే ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి మాటా లేదు. ఈ లోపు డీవీవీ దానయ్య నిర్మాణంలో అనౌన్స్‌ అయిన సినిమా కూడా ఆగిపోయింది. దీంతో రాధిక సినిమా కూడా ఆగిపోయిందా అంటూ ఇప్పుడు డిస్కషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో చిరంజీవి లైనప్‌ గురించి చూద్దాం అంటే.. చాలా రకాల లెక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి లైనప్‌లో రెండు సినిమాలే లైవ్‌లో ఉన్నారు. బాబి ‘వాల్తేరు వీరయ్య’ ఒకటైతే, మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’. సంక్రాంతి దగ్గరకొస్తుండటంతో ఇప్పుడు ఆయన ‘వీరయ్య’ పనులే చేస్తున్నారు. సంక్రాంతి దాటాక ‘భోళా శంకర్‌’ పనులు స్టార్ట్‌ చేస్తారట. ఈ సినిమా తర్వాత చిరంజీవి సిననిమా ఏంటి అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అయితే అది రాధిక సినిమానే అంటున్నారు తాజాగా.

నిజానికి చిరంజీవి ఈ సినిమా ఎప్పుడో చేయాలి. కానీ ఇప్పటివరకు కథ, దర్శకుడు లాంటి చర్చలు ఏవీ జరగలేదట. చిరంజీవి కాస్త సమయం ఇస్తే.. వీటి సంగతి చూడాలని రాధిక అనుకుంటున్నారట. దీని కోసం ఓ ప్రముఖ తమిళ దర్శకుడు సిద్ధంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే సంక్రాంతి దాటాల్సిందే అని సమాచారం. ‘భోళా శంకర్‌’ పనులు చూసుకుంటూ మిగిలిన సినిమాల విషయాలు చూద్దాం అని చిరు అనుకోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవికి కథ చెప్పి ఒప్పించడం పెద్ద పనే అని చెబుతున్నారు. వినోదాత్మకంగతా కథలు రాసుకుంటే.. చిరంజీవిని ఒప్పించేయొచ్చు అని అనుకున్నా వెంకీ కుడుమల కథ ఓకే కాకపోవడంతో ఇంకేదో కావాలి అనే ఆలోచన చిరంజీవికి ఉంది అని అంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్‌ ఓ కథను సిద్ధం చేశారని టాక్‌. మరి చిరు – రాధిక – పూరి కాంబో ఏమన్నా కుదురుతుందేమో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus