Samantha: తమిళనాడులోని ఆ ఫౌండేషన్ లో ఉన్న సామ్.. కారణమిదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గత కొంతకాలంగా ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. సమంత స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధ పడుతున్నారని కొంతమంది ప్రచారం చేస్తుండగా ఆమె అమెరికాలో ఉన్నారని మరి కొందరు ప్రచారం చేస్తుండటం గమనార్హం. సమంత షూటింగ్ లకు దూరంగా ఉండటం వల్లే ఆమె నటించిన సినిమాల షూటింగ్ లు వాయిదా పడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో ఉన్నారు.

మనశ్శాంతి కోసమే సమంత అక్కడ ఉన్నారని అంతకు మించి సమంత అక్కడికి వెళ్లడానికి స్పెషల్ రీజన్ అయితే ఏమీ లేదని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ నెల 10వ తేదీ వరకు సమంత అక్కడే ఉంటారని సమాచారం అందుతోంది. సమంత షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ఆమె నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. సమంత వల్ల షూటింగ్ లు వాయిదా పడటంతో పాటు డబ్బింగ్ వర్క్ కూడా పెండింగ్ పడుతోందని తెలుస్తోంది.

సమంత మళ్లీ షూటింగ్ లతో బిజీ అయితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సమంత కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. యశోద, శాకుంతలం సినిమాలు థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతాయో చూడాల్సి ఉంది. వాస్తవానికి శాకుంతలం త్రీడీ వెర్షన్ వల్ల బడ్జెట్ పెరగడం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా సమంత యాక్టివ్ గా లేకపోవడం ఆమె ఫ్యాన్స్ ను బాధిస్తోంది.

సినిమాసినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో సమంత విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు సమంతకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus