Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌ సెకండ్‌ సినిమా ప్రచారం మొదలవ్వదా…!

వైష్ణవ్‌ తేజ్‌ తొలి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమా ప్రారంభించేశారు. అంతేకాదు సినిమా పూర్తి చేశారు కూడా. కానీ విడుదల కాలేదు. ఇదేంటి కన్‌ఫ్యూజ్‌గా ఉంది అనుకుంటున్నారా? మీకే కాదు నిర్మాతలకు కూడా ఇదే కన్‌ఫ్యూజ్‌ ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటివరకు అక్టోబరు 8న సినిమా విడుదల అంటూ… సందడి ప్రారంభించిన టీమ్‌… ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఉంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అనే అనుమానం వస్తోంది.

నిజానికి ‘కొండపొలం’ సినిమా తొలి లాక్‌డౌన్‌ అయిపోగానే చిత్రీకరించారు. క్రిష్‌ టాలెంట్‌ తెలుసుకదా… చాలా వేగంగా సినిమా పూర్తి చేసేశారు. వైష్ణవ్‌తేజ్‌ తొలి సినిమా ‘ఉప్పెన’ కంటే ముందే ఈ సినిమా విడుదల చేసేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ చేయలేదు. పోనీలే ఆ సినిమా వచ్చాక చేస్తారేమో అనుకున్నారు. కానీ ఎలాంటి స్పందన లేదు. ‘ఉప్పెన’ విజయాన్ని క్యాష్‌ చేసుకోలేకపోయారు. ఇక సినిమా ఓటీటీకా అని అనుకుంటుడగా… అక్టోబరు 8 అంటూ ప్రచారం షురూ చేశారు.

ఇంతలో వైష్ణవ్‌ తేజ్‌ అన్నయ్య సాయిధరమ్‌ తేజ్‌కు యాక్సిడెంట్‌ అయ్యింది. దీంతో సినిమా ఊసులు మళ్లీ ఆగిపోయాయి. ఇప్పుడు సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ను అనుకున్న తేదీకే అంటే అక్టోబరు 1కే విడుదల చేసేస్తున్నారు. మరి వైష్ణవ్‌తేజ్‌ సినిమా సంగతేంటో తెలియడం లేదు. అయితే ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలై వసూళ్లు, స్పందన చూసి అప్పుడు ‘కొండపొలం’ సంగతి చూస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి క్రిష్‌ ఏం చేస్తాడో.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus