Ram Charan: తారక్‌ లేని టైమ్‌ని చరణ్‌ భలేగా వాడుకుంటున్నాడా.. లేక ప్లానింగ్‌ కుదిరిందా..!

రామ్‌చరణ్‌.. రామ్‌చరణ్‌.. రామ్‌ చరణ్‌.. ఇప్పుడు అంతర్జాతీయ సినిమా మీడియాలో, భారతీయ చిత్ర మీడియాలో ఆ మాటకొస్తే కాస్త తెలుగు మీడియాలో ఇదే పేరు రోజూ కనిపిస్తోంది. దీనికి కారణం చరణ్‌ ప్రస్తుతం అమెరికాలో వివిధ ప్రెస్‌మీట్‌లు, ఇంటర్వ్యూలు ఇస్తుండటం, మాట్లాడుతుండటం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ప్రధానంగా మాట్లాడుతున్న రామ్‌చరణ్‌.. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా చెబుతున్నారు. దీంతో ఆ విషయాలు మన దేశంలోనూ వైరల్‌ అవుతున్నాయి. అయితే చరణ్‌ విషయంలో పడని కొందరు వ్యక్తులు నెగిటివ్‌ ప్రచారమూ చేస్తున్నారు.

దీంతో అసలు ఏమవుతోంది అనే చర్చ మొదలైంది. రామ్‌చరణ్‌కు పీఆర్‌ టీమ్‌ చాలా రోజుల నుండి ఉంది. ఇక్కడ, బాలీవుడ్‌లో పీఆర్‌ చేస్తూ ఆ టీమ్‌ చాలా ప్రయత్నాలు చేసింది. అయితే చరణ్‌ గురించి తెలుగు అభిమానులకు తెలిసేలా చేయడంలో ఇక్కడ టీమ్‌ అంత యాక్టివ్‌గా కనిపించేది కాదు. ఏదో ఆయన చెప్పాడు కాబట్టి.. ఓ ట్వీట్‌, ఓ ఫొటో అనేలా ఉండేది. చరణ్‌ మీద ఏదైనా విమర్శలు వస్తే అంత ఫాస్ట్‌గా రిప్లైలు వచ్చేవి కావు. అలాగే క్లారిటీలు కూడా మిస్‌ అయ్యేవి.

అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మారింది. రామ్‌చరణ్‌ అమెరికాలో ఏం చేసినా ఠక్కున మీడియాకు వచ్చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కనిపించేస్తున్నాయి. అలాగే చరణ్‌ కూడా అమెరికాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లూ తారక్‌తో కలసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లినప్పుడు చరణ్‌ ఇంత యాక్టివ్‌గా కనిపించలేదు. తారక్‌ మాట్లాడితే చరణ్‌ వినేవాడు, అవును అనేవాడు. కానీ తారక్‌ వివిధ కారణాల వల్ల అమెరికా వెళ్లకపోవడంతో మొత్తం చరణ్‌ మాట్లాడే పరిస్థితి వచ్చింది.

అలాగే తాను ఓపెన్‌ అయ్యి.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాల్సి వస్తోంది. ఈ క్రమంలో చరణ్‌ కొత్త వెర్షన్‌ అమెరికాలో కనిపిస్తోంది అని అంటున్నారు ఫ్యాన్స్‌. చరణ్‌ను అలా చూసి ‘మా వాడు సూపర్‌’ అంటూ మురిసిపోతున్నారు కూడా. ఎందుకు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో కానీ.. చరణ్‌, అతని చుట్టూ జరిగిన ఈ మార్పు వల్ల ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ ఖుష్‌ ఉన్నారు. తారక్‌ వచ్చాక కూడా చరణ్‌ ఇలానే యాక్టివ్‌గా ఉంటే.. ఫ్యాన్స్‌ ఇంకా హ్యాపీగా ఉంటారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus