Pawan Kalyan: అరవ ట్రోలింగ్‌ వీడియో… పవన్‌ ఫ్యాన్స్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌.. ఎవరు చేశారో?

సినిమా బాగోలేకపోతే బాగోలేదు అని చెప్పొచ్చు.. నచ్చినవాళ్లు నచ్చింది అని చెబుతారు. ఆ తర్వాత నచ్చినోళ్లకు, నచ్చనోళ్లకు మధ్య మాటల యుద్ధం ఉంటుంది. అది ఇప్పుడు కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చింది కాదు. అలా అని ఇది తప్పు కూడా కాదు. కానీ సోషల్‌ మీడియా యుగంలో నచ్చిందని చెప్పినా, నచ్చలేదు అని చెప్పి ట్రోలర్లు యాక్టివ్‌ అయిపోతారు. బోడి గుండుకు, మోకాలికి ముడేసి ఆడేసుకుంటున్నారు. అయితే దీని కూడా ఓ హద్దు ఉంటుంది. దాన్ని దాటేసి ఎవరైనా మీమర్స్‌ ముందుకొస్తే నెటిజన్లు ఉతికి ఆరేస్తారు.

ఇప్పుడు ఓ ట్విటర్‌ వీడియో కింద ఇదే జరుగుతోంది. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అంటే చిరంజీవి తమ్ముడు ఈ మాట తొలి రోజుల్లో వినిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తనకుంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ తెచ్చుకున్నాడు పవన్‌. ఇలాంటి రోజుల్లో చిరంజీవి తమ్ముడు పవన్‌ అంటూ సంబోధిస్తూ ఓ పాటను రాసుకున్నారు అంటే అది సద్విమర్శనా, కడుపు మంట తీర్చుకోవడమా అనేది ఈజీగానే తెలిసిపోతుంది. అలా ‘బ్రో’ సినిమా వచ్చాక ఆ సినిమా ఫలితం గురించి, పవన్‌ గురించి ఓ పాట చేసి, దానికి వెకిలి చేష్టలతో ఓ వీడియో రూపొందించారు ఇద్దరు యువకులు.

ఆ వీడియోను ట్వీట్‌ చేసి ప్రముఖ బాలీవుడ్‌ యూట్యూబ్‌ ఛానల్‌, వెబ్‌సైట్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో అది నిజమైన వీడియో ఏమో అనుకుని చూసేసి 13 లక్షలకుపైగా వ్యూస్‌ ఇచ్చేశారు నెటిజన్లు. అయితే దీని వెనుక ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే కారణం అని తెలుస్తోంది. తమిళ పరిశ్రమకు కొన్ని విన్నపాలు, సూచనలు అంటూ పవన్‌ మాట్లాడాడు. అందరం కలసి పని చేయాలి, మంచి సినిమాలు చేయాలి అన్నాడు.

అయితే వాటిని నెగటివ్‌గా తీసుకుని కొందరు కుర్రాళ్లు కామెంట్లు, మీమ్స్‌ చేస్తున్నారు. వాళ్లు తమిళనాడుకు చెందినవాళ్లని సమాచారం. దీంతో టాలీవుడ్‌ వర్సెస్‌ కోలీవుడ్‌ అనేలా పరిస్థితి లేదని, కావాలని ఇలా చేయొద్దని కొందరు అంటుంటే.. మీ సినిమాలు కూడా వస్తాయిగా అప్పుడు మేమేంటో చూపిస్తాం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పరిస్థితి ఎటువైపు వెళ్తుందో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus