Chiranjeevi: చిరు కొత్త సినిమా: మరో నిర్మాత ఎవరో తెలుసా?

మెగాస్టార్‌తో మెగాఫ్యాన్‌ అంటూ… ఇటీవల ఓ సినిమా అనౌన్స్‌ అయ్యింది తెలుసా? ఎందుకు తెలియదు చిరంజీవి – వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య కాంబోలో రూపొందనున్న సినిమానే కదా అంటారా? ఆ సినిమానే. ఆ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు కో ప్రొడ్యూసర్‌ పేరు ఒకటి వేశారు చూసే ఉంటారు. డాక్టర్‌ మాధవీ రాజు అని. ఆ వ్యక్తి ఎవరు? అనేదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న చర్చ. చిరంజీవితో సినిమా చేయాలని దానయ్య ఎప్పటి నుండో వెయిట్‌ చేస్తున్నారు.

అనుకున్నట్లుగానే సినిమా అనౌన్స్‌ చేశారు. మరి అలాంటి సినిమాకు సహ నిర్మాతగా వేరే పేరు వేయడం, ఆ వ్యక్తి ఎవరో తెలియకపోవడమే ఇక్కడ చర్చకు కారణం. అయితే ఈ విషయంలో సోషల్‌ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. డాక్టర్‌ మాధవీ రాజు అంటే… చిరంజీవి సోదరి అని అంటున్నారు. చిరంజీవికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒకరు విజయదుర్గ అయితే, ఇంకొకరు మాధవి. ఆ మాధవినే ఈ మాధవి అనేది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ.

అయితే గూగుల్‌లో ఆమె పేరు మాధవీరావు అని ఉంది తప్ప మాధవీరాజు అని లేదు. దీంతో ఆమె ఈమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ అయితే లేదు. కానీ చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. ఇటీవల కాలంలో ఇలా ఒక సినిమాకు ఇద్దరు నిర్మాతల పేర్లు పడటం, సహ నిర్మాతల పేర్లు పడటం చూస్తూనే ఉన్నాం. అలా ఆ మధ్య త్రివిక్రమ్‌ భార్య సౌజన్య కూడా ఓ సినిమాలో భాగస్వామి అయ్యారు.

ఫార్ట్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పేరుతో నవీన్‌ పొలిశెట్టి సినిమాకు నిర్మాతగా మారారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలసి ఈ సినిమాను సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుంది. ఈ విషయం పక్కన పెడితే… ఇప్పుడు మెగా156 ప్రాజెక్టులో కో ప్రొడ్యూసర్‌గా పేరు పడిన మాధవీరాజు ఎవరు అనేది తెలియడం లేదు. దీనిపై చిత్రబృందం ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. లేదంటే సినిమా ముహూర్తపు షాట్‌ నాడు కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ విషయంలో సస్పెన్స్‌ తప్పదు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus