Saindhav: శ్రద్దా శ్రీనాథ్ మెయిన్ హీరోయిన్ కాదా??

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ‘సైంధవ్’ సినిమా జనవరి 13 న రిలీజ్ కాబోతుంది. ‘హిట్’ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్.. వంటివి రిలీజ్ అయ్యాయి. రెండిటికీ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ‘రాంగ్ యూసేజ్’ పాట కూడా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో చాలా మాస్ గా కనిపించారు.

యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టారు అని చెప్పాలి. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ను బట్టి చూస్తే చాలా వరకు దర్శకుడు కథ చెప్పేశాడు. అయినా కొన్ని ప్రశ్నలు ఆడియన్స్ ను వెంటాడతాయి. అదేంటి అంటే.. ‘సైంధవ్’ ట్రైలర్లో వెంకీ పక్కన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ఉండటాన్ని చూపించారు. ఆమె పాప తల్లి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె పాప తల్లి కాదు.. పక్కింట్లో ఉండే అమ్మాయి అని దర్శకుడు శైలేష్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.

అప్పుడు పాప తల్లి ఎవరు? ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో హీరోయిన్ ఉంటుందా?ఆ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉండబోతుందా? అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచే అంశం. మరోపక్క ‘సైంధవ్’ ట్రైలర్ లో కనిపించిన పాప సినిమాలో వెంకటేష్ కూతురేనా? ఆమెతో వెంకటేష్ కి బాండింగ్ ఎలా కుదిరింది.. వంటి ప్రశ్నలు కూడా లేవనెత్తేలా చేశాడు దర్శకుడు శైలేష్. ఆ సస్పెన్స్ మాత్రం ‘సైంధవ్’ (Saindhav) సినిమా చేసేవరకు క్లియర్ అవ్వదనే చెప్పాలి. సో సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు దాచిపెట్టాడు శైలేష్ అనుకోవచ్చు

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus