SSMB29: మహేష్ – రాజమౌళి సినిమా… ఆ హీరో ఎవరు? ఎక్కడివారు?

  • April 8, 2024 / 01:50 PM IST

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీనికి #SSMB29 అని పేరు కూడా పెట్టారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని చెబుతున్నారు కానీ… ఎంతవరకు వచ్చింది అనే విషయం మాత్రం చెప్పడం లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీమ్‌.. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం నటుడి ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతోందట. ఈ చర్చల్లో కొన్ని ఆసక్తికర పేర్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో, విలన్‌ కూడా అంతే బలంగా ఉంటాడు. ఎందుకంటే విలన్‌ బలవంతుడు అయితే హీరోయిజం బాగా ఎలివేట్‌ అవుతుంది అనే సినిమా నానుడిని ఆయన బాగా నమ్మడమే. అలా మహేష్‌ సినిమా కోసం స్ట్రాంగ్‌ అపోనెంట్‌ను రెడీ చేయాలని చూస్తున్నారట. అయితే ఆ పాత్ర చాలా హుందాగా ఉంటుందట. కాబట్టి ఓ స్టార్‌ హీరోను ఆ పాత్రలోకి తీసుకుందాం అనుకుంటున్నారట జక్కన్న అండ్‌ కో.

ఈ క్రమంలో బాలీవుడ్‌ నుండి ఓ స్టార్‌ హీరోను ఆ పాత్రలో నటింపజేయాలి అనేది ఆయన ఆలోచన. దీని కోసం ఆ మధ్య అక్షయ్‌ కుమార్‌తో చర్చలు జరిపారు అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ విషయంలో చర్చ లేదు. ఇప్పుడు ఆ పాత్ర కోసమే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ను (Aamir Khan) సంప్రదిస్తారు అని చెబుతున్నారు. అయితే ఆయనను ప్రతినాయకుడి పాత్ర కోసమే అడుగుతున్నారా లేదా అనేది తెలియాలి. అయితే గతంలో ఆయన ‘ధూమ్‌ 3’లో అలాంటి రోల్‌ చేశారు కూడా.

ఇక సినిమా సంగతి చూస్తే… ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సాగే కథ ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) మాటలు రాస్తున్నారు. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాశానని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) కొన్ని రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus