Jr NTR: ఎన్టీఆర్- బామ్మ ల ఫోటో వెనుక అంత కథ ఉందా..!

ఎన్టీఆర్ ను టాలీవుడ్లో అంతా ఆల్ రౌండర్ అంటుంటారు. డ్యాన్స్, ఫైట్స్, డైలోగ్స్, నటన, సింగింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకి అతను చేరువయ్యాడు. చిన్న పిల్లల దగ్గర్నుండీ, వృద్ధ వయసు గలవారి వరకు ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారంటూ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.తాజాగా ఓ బామ్మ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ను గట్టిగా హత్తుకొని మురిసిపోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు ఈ బామ్మ ఎవరు? ఎన్టీఆర్… ను ఎందుకు కలిసింది ఎలా కలిసింది.. అసలు మేటర్ ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం…ఇటీవల ఎన్టీఆర్ తన కొడుకులతో కలిసి ఓ ఫోటోని దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ కుడి చేతికి ఓ కట్టు కట్టి ఉంది. జిమ్లో వర్కౌట్లు చేస్తుండగా.. ఎన్టీఆర్ చేతికి గాయమవ్వడం దాంతో కట్టుకట్టుకోవాల్సిన పరిస్థితి రావడం జరిగింది.

అయితే ఎన్టీఆర్ గాయపడ్డాడు అని తెలియగానే ఈ బామ్మగారు ఎంతో కష్టపడి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళారట. ఎన్టీఆర్ ను చూస్తుంటే వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావుగారిని చూస్తున్నట్టే ఉందని ఈ బామ్మ చెప్పుకుని మురిసిపోయినట్టు తెలుస్తుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus