RaPo22: రామ్‌ సినిమా కోసం వచ్చిన మరో తమిళ మ్యూజిక్‌ కాంబో.. తెలుగులో..!

వరుసగా నాలుగు పరాజయాలు వచ్చాయనేమో రామ్‌  (Ram)  తన కొత్త సినిమా విషయంలో పూర్తి డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. దర్శకుడి ఎంపిక, కథ ఎంపిక, టీమ్‌ ఎంపిక, సినిమా కథ నేపథ్యం.. ఇలా అన్నింటా వైవిధ్యం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తన కొత్త సినిమా సంగీత దర్శకుడి విషయంలో డిఫరెంట్‌ ఆలోచన చేశాడు. మహేష్‌బాబు.పి (Mahesh Babu P)  దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాకు సంగీత ద్వయాన్ని తీసుకున్నారట. తమిళ ఇండస్ట్రీలో హిట్‌ సంగీత ద్వయంగా పేరున్న వివేక్ – మెర్విన్‌ను రామ్‌ (Vivek Mervin) – మహేష్‌ సినిమా కోసం తీసుకున్నారట.

RaPo22

ఈ ఇద్దరికీ వెల్‌కమ్ చెబుతూ ‘Welcoming the “New Sound of Telugu Cinema” అని రాసుకొచ్చాడు రామ్‌. దీంతో ఎవరీ వివేక్‌, మెర్విన్‌.. వీళ్ల సంగీతం మనకు డబ్బింగ్‌ సినిమాల రూపంలో ఏమన్నా పరిచయం ఉందా అనే డిస్కషన్‌ మొదలైంది. వివేక్‌ – మెర్విన్‌ అంటే.. వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. తమిళనాట ‘వడ కర్రీ’తో ఈ ద్వయం గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటారు.

అందులోనూ మంచి పేరే సంపాదించారు. ధనుష్ (Dhanush) ‘పటాస్’ (Pattas) సినిమాలోని ‘చిల్ బ్రో..’ పాటతో వీళ్ల పెయిర్‌ పేరు బాగా ఫేమస్‌ అయింది. ఆ తర్వాత ప్రభుదేవా ‘గులేబా..’ సాంగ్ కూడా అంతే పేరు తెచ్చి పెట్టింది. నయనతార (Nayanthara) ‘డోర’ (Dora) సినిమా మ్యూజిక్‌ కూడా వీళ్లే. కార్తి (Karthi) ‘సుల్తాన్‌’ సంగీత దర్శకులూ వీళ్లే. ఇక్కడో విషయం ఏంటంటే.. వివేక్‌ మెర్విన్‌ బీట్స్‌ చాలా స్పీడ్‌గా ఉంటాయి.

అలాంటి స్పీడ్‌ సాంగ్స్‌కి రామ్‌, భాగ్యశ్రీ (Bhagyashree Borse) లాంటి బెస్ట్‌ డ్యాన్సర్లు ఆడితే ఎలా ఉంటుంది అనేదే ఊహే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. మరి ఈ సినిమాతో (RaPo22) అయినా రామ్‌ డిజాస్టర్‌ స్ట్రీక్‌ ఆగుతుందేమో చూడాలి.

సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus