Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో గెలిచింది ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో అభయహస్తం టాస్క్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇందులో ఐదుగురు హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఛాలెంజస్ ని ఇచ్చాడు. ఈ ఛాలెంజస్ లో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ ఈ ఛాలెంజస్ లో గెలిచి తమ సత్తాని చాటుకున్నారు. ఇందులో షణ్ముక్, సిరి, శ్రీరామ్ చంద్రలు ఉన్నారు. అయితే, ఇక్కడే మరో రెండు టాస్క్ లలో మానస్ ఇంకా జెస్సీ ఇద్దరూ కూడా గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. అనీమాస్టర్ కి వచ్చిన ప్రత్యేకమైన పవర్ ద్వారా కెప్టెన్సీ పోటీదారులు అవ్వచ్చని బిగ్ బాస్ చెప్పినట్లుగా సమాచారం.

అయితే, ఐదుగురుతో పాటుగా అనీమాస్టర్ కూడా లిస్ట్ లోకి రావడంతో మొత్తం ఆరుగురు కెప్టెన్సీకోసం పోటీపడతారు. వీళ్లు మూడు జంటలుగా విడిపోయి టాస్క్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో షణ్ముక్ ఇంకా మానస్ వీరిద్దరూ కెప్టెన్సీకి పోటీ పడబోతున్నారు. మరి వీరిలో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం. బిగ్ బాస్ హౌస్ లాక్డౌన్ అయిన తర్వాత ఛాలెంజస్ చేసిన హౌస్ మేట్స్ ఎవరు పోటీ చేయాలనేదానిపైన బాగా కసరత్తులు చేశారు. ఫస్ట్ బ్యాచ్ లో లోబో ఇంకా షణ్ముక్ వస్తే , ఆ తర్వాత విశ్వ శాక్రిఫైజ్ చేసి సిరిని పంపాడు. సిరి రవితో తలపడి గెలిచింది.

ఆ తర్వాత మానస్ ఇంకా శ్రీరామ్ చంద్రలు రోప్స్ గేమ్ ఆడారు. ఈ రోప్స్ గేమ్ లో విజయం సాధించిన శ్రీరామ్ కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యాడు. అయితే, మానస్ కి మరో ఛాన్స్ వచ్చిందని, అందులో గెలిచాడని చెప్తున్నారు. ప్రియాంక శాక్రిఫైజ్ చేస్తే మానస్ వచ్చాడా లేదా మానస్ కి మరో ఛాన్స్ కెప్టెన్ సన్నీ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సన్నీ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి, మరో ఛాన్స్ తనవంతు వచ్చినపుడు అది మానస్ కి ఇచ్చాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరగబోతోందనేది చూడాలి.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus