Prabhas, Maruti: మారుతి నాయికల్లో ఒకరికి ఛాన్స్‌ ఉంటుందా?

  • February 16, 2022 / 11:25 AM IST

వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ… ఒక మామూలు సినిమా చేద్దాం అనుకున్నాడు ప్రభాస్‌. దానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారని టాక్‌. ఇప్పటికే కథ మీద టీమ్‌ కూర్చుందని కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటల్ని మారుతి కొట్టిపారేశారు. కానీ మరోవైపు పనులు అయితే జరిగిపోతున్నాయి అంటున్నారు. అంతే హీరోయిన్ల ఎంపిక విషయంలో చర్చలు తుది దశకు వచ్చాయని సమాచారం. ఇద్దరు హీరోయిన్లు దాదాపు ఓకేనట. ‘రాజా డీలక్స్‌’… ప్రభాస్‌ – మారుతి సినిమాకు ప్రచారంలో ఉన్న పేరు ఇది.

Click Here To Watch

హారర్‌ కామెడీ అని కొందరు, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ అని ఇంకొందరు చెబుతున్న ఈ సినిమా ఏ జోనర్‌ అనేది పక్కాగా తెలియదు. అయితే ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారు అనే మాట మాత్రం పక్కా అంటున్నారు. అందులో ఇద్దరు నాయికల ఎంపిక దాదాపు పూర్తయిపోయిందట. ఒకరు తమిళనాట నుండి వస్తుంటే, ఇంకొకరు కొత్తందం అట. ఇటీవల ‘పెళ్లిసందD’ సినిమాతో పరిచయమైన శ్రీలీల ఆ నాయికట. ఇక ముందు చెప్పుకున్న తమిళ అందం మాళవిక మోహనన్‌. ‘మాస్టర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమే.

సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలతో కుర్రకారును అలరిస్తుంటుంది కూడా. ఇక మూడో నాయిక ఎవరు అనేదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ పాత్ర గురించి చాలామందిని అనుకుంటున్నా… మారుతి ఆస్థాన నాయికల్లో ఒకరికే ఆ అవకాశం దక్కుతుంది అనేది టాక్‌. అంటే మారుతి గత సినిమాల్లో నటించిన నాయికే ఉండొచ్చట. మారుతి ఇటీవల సినిమాల్లో నటించిన కథానాయికలు అంటే రాశి ఖన్నా, మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదానే. మరి ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి.

ముందు చెప్పుకున్నట్లు ఎంతో ఆసక్తికరమైన ఈ ప్రాజెక్ట్‌ గురించి చిత్రబృందం నుండి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో భారీ స్థాయిలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందట. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి మారుతి సినిమాని మొదలుపెట్టి జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేయాలని ప్రభాస్‌ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎందుకుంత వేగం అనేది తెలియడం లేదు. ఏమైతే ఏముంది… డార్లింగ్‌ నుండి సినిమా వస్తుంది అది చాలు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus