టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్ సినిమాలు అంటే చిన్న భయం పట్టుకుంది. అందుకే రీమేక్ సినిమా చేస్తున్నా… ఎక్కడా ఆ సినిమా రీమేక్ అని చెప్పడం లేదు. అయితే ఈ సమయంలో ఓ రీమేక్ గురించి చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లోకి ఇటీవల ఎక్కువగా దిగుమతి జరుగుతున్న మలయాళ సినిమానే అది కూడా. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం ‘నేరు’. ఈ సినిమా గురించే ఇప్పుడ చర్చంతా. గత వారాంతంలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ భారీ విజయం అందుకుంది.
దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మన హీరోలు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. కోర్టు రూమ్ డ్రామాలకు ఇటీవల కాలంలో విజయాల శాతం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోర్టు రూమ్ డ్రామాను తెలుగులోకి తీసుకు రావడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే తొలుత ఈ సినిమా రీమేక్ చేయడానికి విక్టరీ వెంకటేశ్ ముందుకొచ్చారు అనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు బాగుంటుంది అనే చర్చ మొదలైంది.
‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ పేరుతో తెరకెక్కించి భారీ విజయం సాధించారు. ఇప్పుడు ‘నేరు’ సినిమాను ‘వకీల్‌సాబ్ 2’ గా తీస్తే బాగుంటుంది అనేది ఓ వర్గం వాదన. నిజానికి వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనే ‘వకీల్ సాబ్ 2’ ఉంటుందని తొలి సినిమా అప్పుడు లీకులు వచ్చాయి. కానీ అప్పుడు అనుకున్నది అవ్వలేదు. దిల్ రాజు నిర్మాణంలోనే ఆ సినిమా కూడా ఉంటుంది అన్నారు. మరిప్పుడు ‘నేరు’ (Neru) కథను నేరుగా దిల్ రాజు తీసుకుంటే ‘వకీల్ సాబ్ 2’ చేసేయొచ్చు.
అయితే, వెంకటేశ్ గతంలో ‘ధర్మ చక్రం’ పేరుతో ఓ కోర్టు రూమ్ డ్రామా చేశారు. ఆ సినిమాకు మంచి విజయం, ప్రశంసలు దక్కాయి. మరిప్పుడు ‘నేరు’ సినిమా చేస్తే అలాంటివే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి ఎవరికి దక్కుతుందో ఆ ఛాన్స్ చూడాలి. వెంకీ అయితే 76వ సినిమా చేసేస్తారు. పవన్ అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!