ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man) సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జ (Teja Sajja) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సంక్రాంతికి పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) పోటీగా ఉన్నప్పటికీ ‘హనుమాన్’ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం.. ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘హనుమాన్’ కథ, కథనాలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ క్లైమాక్స్ పోర్షన్ సినిమాని అమాంతం లేపింది. ‘చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నాడు’ అనేది చాలా మంది నమ్మకం.
దానిని దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువల్ గా చూపించి ఆడియన్స్ ని ఇంకో వరల్డ్ కి తీసుకెళ్లాడు. ఇక అదే టైంలో ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ఉంటుందని కూడా రివీల్ చేశాడు. ఒక ‘హనుమాన్’ కి క్లైమాక్స్ లో హనుమంతుడిని తెచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ ఆ సినిమాలో హనుమంతుడుని గ్రాఫిక్స్ లో అంటే టెక్నాలజీ వాడి చూపించాడు. అయితే సెకండ్ పార్ట్ కి ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని (Rishab Shetty) తీసుకున్నాడు.
‘హనుమంతునికి ఇచ్చిన మాట విభీషణుడు నిలబెట్టుకోవడం’ అనేది ‘హనుమాన్’ లైన్, అయితే ‘శ్రీరామునికి ఇచ్చిన మాట హనుమంతుడు ఎలా నిలబెట్టుకున్నాడు’ అనేది ‘జై హనుమాన్’ లైన్. సో ‘హనుమాన్’ క్లైమాక్స్ లో హనుమంతుడు వచ్చినట్టే.. ‘జై హనుమాన్’ క్లైమాక్స్ లో రాముడిని కూడా చూపించాలట. కథ అలా డిమాండ్ చేస్తుందని సమాచారం. అయితే ఈసారి రాముడి పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఎవరైనా హీరోని తీసుకుంటారా? లేక తన ఫ్లెక్సిబిలిటీ బట్టి.. ఏఐ(Artificial Intelligence) సాయంతో మేనేజ్ చేసేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.