‘పుష్ప’లో విలన్ ని కన్ఫర్మ్ చేయరా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమాలతో ఒక్కోసారి ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. సినిమాలు తీసేప్పుడు కూడా ఏదీ ఒక పట్టాన ఓకే చేయరని.. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారని.. సెట్స్ లోకి వెళ్లిన తరువాత కూడా మార్పులు చేయడం సుకుమార్ కి అలవాటని చెబుతుంటారు. స్క్రిప్ట్ విషయంలోనే కాదు.. ఆర్టిస్ట్ ల విషయంలో కూడా ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. చివరి నిమిషం వరకు కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. తన కొత్త సినిమా ‘పుష్ప’ విషయంలో కూడా ఇలానే మార్పులు చేస్తూ కన్ఫ్యూజన్ లో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఏడాది ముందు మొదలవ్వాల్సి ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లలేదు. దానికి కారణం కరోనా మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఈ నెల 10 నుండి మారేడుమిల్లి, వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో మెయిన్ విలన్ ఎవరనేది ఇంకా ఖరారవ్వలేదు. మిగతా పాత్రల విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఆర్టిస్టులు చాలా వరకు ఫైనలైజ్ అయ్యారు కానీ విలన్ సంగతి మాత్రం తేలలేదు. విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ డేట్లు కుదరక తప్పుకున్నాడు.

ఆ తరువాత బాబీ సింహా, నారా రోహిత్ ఇలా చాలా మంది నటుల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ పాన్ ఇండియా సినిమాకు హిందీలో క్రేజ్ తీసుకురావడానికి.. విలన్ పాత్రకు బాబీ డియోల్ ని తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట సుక్కు. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. సుక్కు డిసైడ్ చేసుకోలేకపోవడంతో విలన్ లేకుండానే షూటింగ్ మొదలుపెడుతున్నారు. మొదటి రెండు షెడ్యూల్స్ విలన్ లేకుండానే పూర్తి చేస్తారట. ఆ తరువాత విలన్ ని ఫైనల్ చేసుకొని మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయబోతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus