Spirit – Varanasi: సైడ్ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్ ఇస్తారా?
- August 26, 2026 / 02:30 PM ISTByFilmy Focus Desk
రెండు సినిమాల రిలీజ్ డేట్‌ల మధ్య నెల రోజులకుపైగా సమయం ఉంది. అయితే అనూహ్యంగా ఈ రెండు రిలీజ్ డేట్‌ల విషయంలో చర్చ మొదలైంది. ఒక సినిమాకు మరొక సినిమా పోటీనా అనే మాటలు వినిపించాయి. దీనిపై ‘స్పిరిట్’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించేశారు. అయితే ఆయన స్పందన చూశాక మరికొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో మీకు క్లారిటీ రావాలంటే ముందు రెండు సినిమాల రిలీజ డేట్‌లు చూడాలి. ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5న తీసుకొస్తామని చెప్పారు. ఇక మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాను ఏప్రిల్ 7న తీసుకొస్తామని చెప్పారు.
Spirit – Varanasi
అంటే రెండు సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉంది. కానీ హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడం పక్కా. విదేశాల్లో కూడా సినిమా రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. కాబట్టి ఈ సినిమా రన్ పూర్తవ్వడానికి కనీసం నెల పడుతుంది అని అంచనా వేస్తున్నారు. అంతకుమించి ఈ సినిమా ఆడాలి అంటే ‘వారణాసి’ వచ్చేస్తుంది. దాంతో ‘స్పిరిట్’ సినిమాకు ఇబ్బంది అవుతుంది. దీంతో కాస్త ముందుగానే సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటున్నారు సందీప్.
లేదంటే.. ‘స్పిరిట్’ కోసం ‘వారణాసి’ సినిమాను వాయిదా వేయాల్సి ఉంటుంది. మరి రాజమౌళి ఆ పని చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే చాలా నెలలుగా రాజమౌళి అండ్ కో. ఇVదే డేట్ మేం ఫిక్స్ అయ్యాం అని చెబుతున్నారు. మరి ప్రభాస్ సినిమా కోసం వెనక్కి జరిగే ఉద్దేశం ఉందా అనేది తేలాలి. అయితే ఈ విషయంలో లెక్క తేలాలంటే సినిమా షూటింగ్‌లు, డబ్బింగ్‌లు పూర్తవ్వాలి. రెండు సినిమాలకు సినిమా షూటింగ్‌తోపాటు డబ్బింగ్ కూడా చాలా ముఖ్యం.
ఎందుంకటే రెండు సినిమాలను మన దేశంలోని ముఖ్య భాషలతో సహా విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా తేలాలంటే సినిమా పూర్తయి.. డబ్బింగ్ కూడా అవ్వాలి. కాబట్టి మహేష్‌బాబు కోసం ప్రభాస్ కాస్త ముందుగా వచ్చేస్తారా? లేక రాజమౌళినే ప్రభాస్ కోసం లేట్‌గా వస్తారా అనేది చూడాలి.















