యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అలియాభట్ ను తీసుకోవాలనుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్ తో ఏర్పడిన స్నేహం కారణంగా అలియా కూడా సినిమా ఒప్పుకుంది. ఆమెకి తన పాత్ర కూడా నచ్చింది. కానీ ఇప్పుడు అలియా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ సినిమా ఒప్పుకుంది. ఈ సినిమా పూర్తయిన తరువాతే మరో సినిమా చేయగలదు.
ఎన్టీఆర్ సినిమాకి హీరోయిన్ కాల్షీట్స్ చాలానే కావాలి. అలియాభట్ వచ్చేవరకు సినిమాను హోల్డ్ లో పెట్టలేరు అందుకే వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారు. అలియాకు బదులుగా ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్న. అలియా స్థానంలో బాలీవుడ్ నుంచి ఓ టాప్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. లేదంటే ఇటు సౌత్, అటు నార్త్ లో పరిచయమైన కియారా అద్వానీ, రష్మిక లాంటి వారి గురించి ఆలోచించాలి. కీర్తి సురేష్ కూడా ఒక ఆప్షన్ గా ఉంది.
మరి కొరటాల ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఈసారి ఏ చిన్న విషయంలో కూడా పొరపాటు చేయాలనుకోవడం లేదు కొరటాల శివ. ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ముందుగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాలతో షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నారు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!