“పవనిజమ్” అనే పధం వింటే, పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటారు. అసలు పచ్చిగా చెప్పాలి అంటే పవన్ ను ఒక హీరోగా కాకుండా, సాక్షాత్తూ దేవుడుగా కొలుస్తారు. ఇలా పవన్ అభిమానులు అతిగా ప్రవర్తించడం వల్లనే పవన్ కు చేదు అనుభవం ఎదురయిందా? ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఇదే టాక్. సర్దార్ సినిమా కధ రెండు రోజులకే సుఖాంతం అయ్యింది. భారీ హిట్ అవుతుంది అని అనుకున్న సినిమా డిజాస్టర్ గా మారి పవన్ అభిమానులకు ఉగాది రోజున ‘చేదు’ రుచిని చూపించింది. ఇదిలా ఉంటే…అసలు పవన్ సర్దార్ సినిమాకు ఈ విధంగా ఫలితం రావడానికి అసలు కారణం ఏంటో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎక్కువశాతం వారు చెబుతున్న మాటల ప్రకారం చూస్తుంటే, పవన్ ను అతిగా ఊహించుకుని, ఆకాశానికి ఎత్తెయ్యడమే ఈ ఫలితానికి కారణం అని వినిపిస్తుంది.
పవన్ వీరాభిమానులు పవన్ ను దేవుడుగా కోలుస్తూ ఉండడంతో తాను ఎలా చేసినా, ఎలా తీసినా తన అభిమానులు తన సినిమాకు చూస్తారనే అతి నమ్మకంతో పవన్ చేసిన ప్రయోగమే ఈ ‘సర్దార్’ అని కామెంట్స్ సినీ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క టాలీవుడ్ టాప్ హీరో అయిన పవన్ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది అని అభిమానులు అస్సలు ఊహించలేదు ఎందుకంటే లక్షల్లో ఉన్న పవన్ అభిమానులు ఒక్కొక్కరూ రెండు సార్లు చూసిన సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు అని తెలుస్తుంది. ఏది ఏమైనా…హడావిడి ఎక్కువయ్యి, మ్యాటర్ తక్కువయ్యి, సర్దార్ సినిమా బోల్తా పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి పవన్ కాస్త ఆలోచించి మంచి కధతో వస్తే టాలీవుడ్ ఖచ్చితంగా భారీ హిట్ ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.