బిగ్ బాస్ 4 : మోనాల్ తో కలిస్తే ఏమవుతుంది..?

బిగ్ బాస్ హౌస్ లో 80వ రోజు ఆసక్తికరమైన విషయం జరిగింది. మోనాల్ తో గ్రేవ్ యార్ట్ లో డేట్ కి వెళ్లాలని ఇందుకోసం అభిజిత్ అండ్ అఖిల్ ఇద్దరూ కూడా మోనాల్ ని ఒప్పించాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే అభిజిత్ మళ్లీ మోనాల్ విషయంలో ఇలా జరుగుతోంది అసలు నాకు ఇష్టం లేదు అంటూ మాట్లాడాడు. అంతేకాదు, టాస్క్ పేపర్ లో ఫస్ట్ మోనాల్ ని ఏడిపించినందుకు గానూ మీరు ఆమెని డేట్ కి తీస్కుని వెళ్లాలి అని రాసి ఉంది. దీంతో బాగా హర్ట్ అయ్యాడు అభిజిత్. ఇద్దరికీ క్విజ్ కాంపిటేషన్ పెడతారు. అందులో గెలిచిన వాళ్లు మోనాల్ తో డేట్ కి వెళ్లాలని టాస్క్ పేపర్ వచ్చింది.

అసలు ఇప్పటికే చాలా రచ్చ అయ్యిందని, ఇలా ఇంక మోనాల్ తో అసలు వద్దు అనే టైమ్ లో ఇలాంటి టాస్క్ పెట్టడం ఏంటి అంటూ టాస్క్ చేయడానికి నిరాకరించాడు. అసలు మోనాల్ బిజినెస్ వద్దని బిగ్ బాస్ ని వేడుకున్నాడు. నాకు అస్సలు మోనాల్ – అభిజిత్ ప్రొజెక్షనే వద్దు అంటూ మాట్లాడాడు.

నిజానికి మోనాల్ తో డేట్ కి వెళ్తే అది ఒప్పుకున్నట్లుగానే అవుతుంది కదా అన్నట్లుగా మాట్లాడారు. ఇక్కడే అఖిల్ కరెక్ట్ గా మాట్లాడాడు. క్లియర్ గా టాస్క్ లో చెప్పారు.. ఇష్టముంటే చేయాలి లేదంటే లేదు. అయినా టాస్క్ లో అబ్జక్షన్ గా ఏం రాయలేదు అని, కానీ అభిజిత్ మాత్రం మోనాల్ తో డేట్ కి వెళ్లేందుకు మాత్రం ఇష్టపడలేదు.

మోనాల్ తో కలిసి మళ్లీ డేట్ అంటూ ఇలా ఏదో ఒక టాస్క్ రూపంలో వెళ్లడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పాడు అభిజిత్. నాకు ఇప్పుడు అర్ధమవుతోంది ఇది పిక్చర్ బయటకి ఎలా వెళ్తోంది అనేది అంటూ అభిజిత్ ఆవేదన చెందాడు. అందుకే మోనాల్ తో డేట్ కి వెళ్లడానికి ఇష్టపడలేదు. టాస్క్ ఆడటానికి ఇష్టపడలేదు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus