Allu Arjun: ‘పుష్ప’ గురించి అల్లు అర్జున్‌ ఇలా అంటున్నాడేంటి!

మా సినిమా అదిరిపోయింది… థియేటర్ల వచ్చి చూడండి!
మా సినిమా మామూలుగా ఉండదు… మీకూ నచ్చుతుంది!

మా సినిమా బంపర్‌ హిట్‌.. విడుదలైతే రికార్డులే రికార్డులు!
మా సినిమా బ్లాక్‌బస్టర్‌… థియేటర్లలో వసూళ్ల సునామీ వస్తుంది!

సినిమా ప్రచారంలో ఇలాంటి మాటలు మనం చాలా వింటూనే ఉంటాయి. సినిమా బాగుండదు, బాగోదు, ఆడదు అని తెలిసినా కూడా ఇదే మాట చెబుతుంటారు మన హీరోలు, దర్శకులు. ఎందుకంటే అది వారి సినిమా కాబట్టి. ఈ విషయంలో ఉన్నది లేనిది కలిపి చెప్పేస్తారు అనే విమర్శలూ ఉన్నాయి. అయితే పాన్‌ ఇండియా సినిమా తీసి… ఏ మాత్రం సినిమాకు హైప్‌ రాకుండా చూసుకుంటున్నారు అంటే ఆసక్తికరమే కదా. అయితే ఇది జరుగుతోంది. అది కూడా రేపు విడుదలయ్యే సినిమా గురించే. అవును ‘పుష్ప’ గురించే మాట్లాడుతున్నాం.

‘పుష్ప’ సినిమా ప్రచారం కోసం గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌, రష్మిక, దేవిశ్రీప్రసాద్‌ దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… అన్ని వుడ్స్‌ తిరుగుతున్నారు. అయితే అక్కడ సినిమా గురించి మాట్లాడే క్రమంలో బన్నీ… చాలా జాగ్రత్తగా వివరాలు చెబుతున్నాడు. ప్రెస్‌మీట్‌లో సినిమా అదిరిపోతుంది, బ్రహ్మాండం లాంటి మాటలు అనడం లేదు. కేవలం సినిమా గురించి పడ్డ కష్టం గురించి చెబుతున్నాడు. సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, చిత్రబృందం పడ్డ శ్రమ గురించి చెబుతున్నారు.

సినిమా ఎలా ఉంటుంది అనే మాట వచ్చినప్పుడల్లా… ‘సినిమా బాగా ఆడితే చాలు’ అనే అర్థం వచ్చేలా చెబుతున్నాడు. అంతేకాదు తన దర్శకుడు సుకుమార్‌ కూడా ఇదే మాట అంటున్నారు అని చెబుతున్నాడు. ఇదంతా చూస్తుంటే… సినిమా గురించి ఎక్కడా అధికంగా ఎక్కడా చెప్పడం లేదు. అయితే దీని వెనుక ‘పుష్ప’ టీమ్‌ పెద్ద స్ట్రాటజీనే వాడుతోందని తెలుస్తోంది. సినిమా మీద ఓవర్‌హైప్‌ రాకుండా చూసుకోవడంలో భాగంగానే ఈ పని చేస్తున్నారని టాక్‌. సినిమా గురించి ఎక్కువగా చెప్పి ఇబ్బందులు పడకుండా… ఇలా తక్కువగా చెప్పి అక్కడ సినిమా బాగుంటే మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నట్లున్నారు. అయితే హైప్‌ తక్కువగా ఉంటే ఓపెనింగ్స్‌ బాగా తక్కువగా ఉంటాయనేది మరో కోణం. మరి ఈ విషయంలో సుకుమార్‌ అండ్‌ టీమ్‌ ఏ ఆలోచనలు చేస్తుందో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus