ఇప్పుడైనా , అప్పుడైనా సినిమాలో ఐటమ్ సాంగ్ కు ప్రత్యేకత ఉంటుంది. సినిమా ప్లాప్ అయిన ఆ అందులోని ఐటమ్ సాంగ్ హీట్ అవుతోంది. అయితే ఐటమ్ సాంగ్ అక్కినేని నాగేశ్వరరావు ఏమన్నారో తెలుసుకుందాం. 1970 దశకం నుండి మెల్లిగా ఐటమ్ సాంగ్ ల ప్రభంజనం మొదలైంది. ఆ పాటలకు ఆజ్యం పోసింది ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ్ నగర్ లోని “లే లే నా రాజా.. నువ్వు లేవనంటావా..” అనే పాటనే చెప్పాలి. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన సాంగ్..
ఇక అక్కినేని నాగేశ్వరరావు (ANR) మిగతా చిత్రాలతో పోల్చితే ఆయన కెరీర్ లో ప్రేమ్ నగర్ చిత్రానికి ఉన్న స్థానం వేరుగా ఉంటుంది. అక్కినేనికి మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా రామానాయుడుకు విజయాన్ని అందించిన చిత్రమిది. ఒకవేళ ఈ సినిమా ఆడకపోతే నిర్మాతగా ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడును నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా తెలుగుతో సహా తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమా తీసే ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ప్రేమనగర్. ఈ సినిమాలో పాటలన్నీ హిట్స్. ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి.
ఆత్రేయ పాటలు అంటే మసాలాలు దట్టించడం బాగా ఉంటుంది. ఆ పాటల్లో ఐటమ్ సాంగ్ గనక ఉంటే చెప్పేదేముంది.. ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాట మసాలా ఘాటును వెదజల్లుతుంది. “లే లే లే..నా రాజా.. నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా”.. ఘంటసాల, ఎల్ ఆర్.ఈశ్వరి పాడిన ఈ పాటని సినిమాలో అక్కినేని, జ్యోతిలక్ష్మి లపై చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ పాట విన్నవారంతా హవ్వ..! నాగేశ్వరావు సినిమాలో ఇలాంటి పాట.. అని విమర్శించారు. కానీ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత సర్దుకు పోయారు.
ఒకరోజు నాగేశ్వరరావు సెట్ లోకి వచ్చేసరికి వాణిశ్రీ సినిమా లోని ఐటమ్ సాంగ్ పాట వాడుతున్నారు. అది ఏ సినిమా లోనిది అని నాగేశ్వరరావు అడుగగా అప్పుడు మన ప్రేమ్ నగర్ సినిమా లోనిది.. మీరు, జ్యోతిలక్ష్మి కలిసి ఈ పాట పడాల్సి ఉంటుందని వాణిశ్రీ నాగేశ్వరావు చెప్పడంతో.. అప్పుడు నాగేశ్వరరావు నాన్సెన్స్.. ఆ పాట మన సినిమాలో అవసరం లేదని షాట్ రెడీ అయిందని వెళ్లిపోయారు. ఒక్కసారిగా నిర్మాత డి.రామానాయుడు గుండెల్లో బండ పడ్డట్టు అయింది. తర్వాత రోజు వాణిశ్రీ సెట్ లోకి వచ్చేసరికి నాగేశ్వరరావు ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నారని తెలిసింది.
కారణం ఏంటని నాగేశ్వరరావును వాణిశ్రీ అడగగా.. సినిమాకు ఆ పాట చాలా కీలకమని చిత్రీకరించిన తర్వాత ఆ పాట మీకు నచ్చనట్లయితే దానిని సినిమా నుంచి తొలగిస్తామని దర్శకుడు ప్రకాష్ రావు చెప్పగానే ఒప్పుకొని ఆ పాట చేయడానికి సిద్ధపడ్డానని నాగేశ్వరరావు చెప్పారు. అలా ఆ పాట చిత్రీకరణ జరిగి, ప్రేమ్ నగర్ సినిమా 1974లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఈ పాట వింటే, చచ్చినవాడు కూడా పైకి లేస్తాడు.. అంతటి ఘన విజయం సాధించింది ఈ పాట.