‘అంటే సుందరానికి’.. టీమ్‌ ఇలా ఎందుకు చేసిందో..!

సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రనో లేక సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రనో విడుదలకు ముందు దాచి.. సినిమాలో సర్‌ప్రైజ్‌గా అందిస్తుంటారు కొంతమంది దర్శకులు. మొన్నీమధ్య ‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో రితికా నాయక్‌ను అలానే చూశాం. మరీ అంత పెద్ద పాత్ర కాకపోయినా ‘అంటే సుందరానికి’లో అనుపమ పరమేశ్వరన్‌ పాత్రను కూడా అలా దాచారు. సినిమా విడుదలకు ముందు ఆమె గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంతేకాదు సినిమా విడుదల తర్వాత కూడా ఆమె పేరు సినిమా బృందం నోట వినిపించడం లేదు.

అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో ఎవరికీ తెలియని హీరోయిన్‌ కాదు. ఆమె సినిమాలో ఉందనే విషయం ఏదో యూఎస్‌పీ కోసం దాచారు అనుకుందాం. నాని, నజ్రియా నజీమ్‌ను ప్రముఖంగా పెట్టి ప్రచారం చేశారు అనుకుందాం. మరి సినిమా విడుదలయ్యాక జరిగిన, జరుగుతున్న ప్రెస్‌ మీట్స్‌లో ఎందుకు అనుపమ పరమేశ్వరన్‌ పేరును ప్రస్తావించడం లేదనేది అర్థం కావడం లేదు. సినిమాలో నాని సహోద్యోగి పాత్రలో అనుపమ సినిమాలో నటించింది. సినిమాలో ఆమె కనిపించేది సుమారు 15 నిమిషాలే కావొచ్చు.

కానీ ఆమె పాత్ర కీలకమే. అలాంటి పాత్ర గురించి పోస్ట్‌ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో వాడటం లేదు అనేది తెలియడం లేదు. అంతేకాదండోయ్‌ సినిమా కోసం ఆమె సుమారు వారం కాల్‌షీట్లు ఇచ్చింది. అందుకోసం నిర్మాతల నుండి సుమారు రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు తీసుకుందని అంటున్నారు. అంతిచ్చినందుకు ఆమెను ప్రచారంలోకి తీసుకొచ్చి అంతోకొంతో వసూళ్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని నిర్మాతలు ఎందుకు అనుకోవడం లేదో మరి.

ఎక్కడా మాట్లాడలేదు అంటే.. అవకాశం రాలేదు అనే మాట చెప్పే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ‘అంటే సుందరానికీ’ సక్సెస్ మీట్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మొత్తం టీమ్‌కి థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో ఎక్కడా అనుపమను గుర్తు చేసుకోలేదు. ‘అంటే సుందరానికీ’ టీమ్ పెట్టిన ఫస్ట్ సక్సెస్ మీట్ ఇదే. కాబట్టి అందులో మరచిపోయారు అనుకుంటే.. ‘మైత్రీ’ వాళ్ల సినిమా కాబట్టి ఇలాంటి సక్సెస్‌ మీట్‌లు, థ్యాంక్స్‌ మీట్‌లు చాలానే జరుగుతాయి. మరి అందులోనైనా అనుపమ పేరు వినిపిస్తుందేమో చూడాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus