అక్కినేని నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ చిత్రం జనవరి 14న విడుదల కాబోతుంది.నాగ చైతన్య కూడా ఇందులో హీరోగా నటిస్తున్నాడు కాబట్టి.. ఇది ఒక మల్టీస్టారర్ మూవీ అని చెప్పాలి. ఈ సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ వంటి చిత్రాలు రావడం లేదు కాబట్టి… ‘బంగార్రాజు’ పైనే ప్రేక్షకుల దృష్టాంతా ఉంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం కూడా ఖాయం అనుకున్న తరుణంలో ఏపి ప్రభుత్వం.. అక్కడ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది.
అంతే కాదు థియేటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ చెయ్యాలనే నిబంధన కూడా పెట్టింది.అయినా ‘బంగార్రాజు’ వెనక్కి తగ్గలేదు. అనౌన్స్ చేసిన డేట్ కే రాబోతున్నట్టు చెప్పకనే చెప్పింది. ‘బంగార్రాజు’ కలెక్షన్లు తగ్గుతాయని భయం కూడా లేకుండా నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. ఇంతలో ఓ వార్త ఏపి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని జనవరి 18 వరకు వాయిదా వేయడం.దీని వెనుక నాగార్జున రిక్వెస్ట్ ఉందేమో అనేది ఇన్సైడ్ టాక్. ఆయన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఏపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.
టికెట్ రేట్ల ఇష్యు పై స్టార్ హీరోలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటిస్తే… నాగార్జున మాత్రం టికెట్ రేట్లు తగ్గించడం పై తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలపడం.. అలాగే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టైములో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు అని ఏపి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే ఏపి ప్రభుత్వం నాగార్జునకి మాత్రమే పక్షపాతం చూపిస్తున్నట్టు ఇండస్ట్రీ జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున సినిమాకి మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీకి ఇలాంటి సహాయసహకారాలు చేస్తే.. కోవిడ్ వల్ల ఇప్పటివరకు నష్టపోయిన ఇండస్ట్రీ త్వరగా కోలుకుంటుంది కదా అనేది వారి అభిప్రాయం..!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!