సంక్రాంతి వార్‌: హీరో మరచిపోతే.. దర్శకుడితో చెప్పించారా?

రెండు సినిమాలు ఒకే సీజన్‌కి వచ్చినప్పుడు.. ఒకరినొకరు అభినందిచుకోవడం పరిపాటి. ఇటీవల కాలంలో ఇలాంటి డబుల్‌ రిలీజ్‌, అభినందనలు మనం చూస్తేనే ఉన్నాం. అలా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు సంక్రాంతి సీజన్‌కు వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల టీమ్‌ను ఈ విషయాన్ని ఎలా అభినందిస్తాయి అని చాలామంది ఎదురుచూశారు. కానీ ఒకరి నుండే అభినందనలు వచ్చాయి.. ఇంకొకరు ఆ టాపిక్‌ ఎత్తకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్‌ వేడుక ముందు జరిగింది. ఒంగోలులో నిర్వహించిన వేడుకలో బాలయ్య సుమారు 30 నిమిషాలు మాట్లాడారు. సినిమా గురించి, తన గురించి, టీమ్‌ కష్టం గురించి ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అయితే ఎక్కడా ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తావన రాలేదు. అక్కడికి రెండు రోజులకు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విశాఖపట్నంలో జరిగింది. అందులో చిరు సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఈ క్రమంలో ఆఖరున ‘వీర సింహా రెడ్డి’ టీమ్‌ను ప్రశంసించారు.

‘‘ఇన్నేళ పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతోంది. దీనికి కారణం కథలపై మైత్రీ మేకర్స్‌ వాళ్లకు నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలనూ అదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’అని చెప్పారు. ఆ విషెష్‌ తర్వాత ‘వీర సింహా రెడ్డి’ టీమ్‌ నుండి విషెష్‌ వచ్చాయి.

సినిమాలోని ‘మాస్ మొగుడు…’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌కి అభినందనలు చెప్పాడు. ‘‘పండగకు బోతున్న రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘వీర సింహా రెడ్డి’ సినిమాలానే ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. అయితే, హీరో మరచిపోయినా.. దర్శకుడితో చెప్పించారు అనే కామెంట్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి వీటిపై టీమ్‌ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus