Bindu, Nataraj: మాట్లాడుతుంటే ఉమ్మేసిన బిందు..! కావాలనే ఇద్దరూ ఇలా చేశారా..?

  • May 11, 2022 / 10:48 AM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో బిందు కి ఇంకా నటరాజ్ మాస్టర్ కి సాలిడ్ గా పడింది. మాస్టర్ తన మనసులో ఏం దాచుకోకుండా బిందుపై ఫైర్ అయ్యారు. అసలు నువ్వు గేమ్ ఆడట్లేదని, ఒక్క గేమ్ ఆడింది చూపించమని ప్రశ్నించారు. నేను హౌస్ లోకి కాలు పెట్టినప్పటి నుంచీ గేమ్ ఆడుతున్నాను అంటూ కౌంటర్ వేసింది. ప్రతి టాస్క్ లో నువ్వు వెనకబడ్డావ్ అని, నీకు టాప్ – 5లో ఉండే అర్హత లేదని మాస్టర్ పగ తీర్చుకున్నారు.

అంతకుముందు బిందు నటరాజ్ మాస్టర్ ని నిలబెట్టి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ అనేవి పీక్స్ కి వెళ్లాయి. నువ్వా – నేనా అన్నట్లుగా ఇద్దరూ పోటీ పడ్డారు. మాటకి మాట అనుకున్నారు. బిందుమాధవి మీకు బుద్ది లేదు ప్రతిసారి కెమెరాకి వెళ్లి చెప్తున్నారు అంటూ మాస్టర్ ని రెచ్చగొట్టింది. మాస్టర్ మాట్లాడుతుంటే, పక్కకి తిరిగి ఉమ్మేసింది బిందు. ఛీ- ఫో అంటూ మాస్టర్ ని తీసిపారేసినట్లుగా పక్కకి తిరిగి ఉమ్మేసి ఛీకొట్టింది బిందు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిందు మాధవి నటరాజ్ మాస్టర్ మాటకి మాట చెప్తూ అమ్మోరులాగా ఫోజు పెట్టింది. మాస్టర్ కూడా బాణం వేస్తున్నట్లుగా వేస్తూ, ఇదే నా లక్ష్మణ బాణం అంటూ రెచ్చిపోయారు. నువ్వు సూర్పణఖ అని, నీ ముక్కు ఆడియన్స్ కోస్తారంటూ రెచ్చగొట్టారు మాస్టర్. అందుకే, ఇదిగో లక్ష్మణ బాణాన్ని వదులుతున్నా కాస్కో అంటూ రెచ్చిపోతే, అమ్మోరులాగా ఫోజు పెట్టి శూలం విసురుతూ బిందు రెచ్చిపోయింది.

ఇద్దరి మద్యలో వార్ హాట్ హాట్ గా సాగింది. ఎవ్వరూ కూడా తగ్గేదేలే అన్నట్లుగా చాలాసేపు ఆర్గ్యూమెంట్స్ చేస్కున్నారు. ఇద్దరూ పర్సనల్ గా ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. ఆ తర్వాత బాబాభాస్కర్ కూడా నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ చెన్నై, ఆంధ్రా అనే ఫీలింగ్ నువ్వు తేవడం కరెక్ట్ గా లేదని చెప్పారు.

అంతేకాదు, రేస్ లో ఎప్పట్నుంచీ స్టార్ట్ చేసినా కూడా కష్టంగానే ఉంటుందని గుర్తు చేశారు. ఇదే నామినేషన్స్ లో యాంకర్ శివకి ఇంకా మిత్రాకి కూడా పెద్ద యుద్ధమే జరిగింది. మిత్రా ఎగ్జిట్ ఫ్రేమ్ కి కొట్టుకుంటూ మరీ ఆర్గ్యూ చేసింది. మొత్తానికి ఈవారం సోషల్ మీడియాలో బిందు – నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా వైరల్ అయ్యారు. అదీ మేటర్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus