ఏదైనా సినిమా విజయం సాధిస్తే తట్టుకోలేని వాళ్లను ఏమనాలి? ఇంకా చెప్పాలంటే బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే చూడలేని వాళ్లను ఏమనాలి? గతంలో ఎవరు ఏ పేరు పెట్టారో మనకు తెలియదు కానీ… ఇప్పుడు అయితే ‘బాలీవుడ్ క్రిటిక్స్’ అని అనొచ్చు. ఏంటీ ఇంత పెద్ద మాట అనేశారు అనుకుంటున్నారా? మాట పెద్దదే కావొచ్చు, కానీ సోషల్ మీడియాలో ఆ జనాలు చేస్తున్న నానా రచ్చ చూశాక ఈ మాటే కరెక్ట్ అని అంటారు. కుదిరితే ఇంకాస్త ఎక్కువే అంటారు.
సినిమా పరిశ్రమలో హీరోలు అంతా ఒక్కటే. దానికి భాషతో సంబంధం లేదు అని చెబుతుంటారు. వాళ్లు ఈ మాటను ఎంత పాటిస్తారో తెలియదు కానీ అభిమానులు మాత్రం పాటించాలి. ఎందుకంటే స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే మంచిది కాబట్టి. గతంలో టాలీవుడ్ జనాలు కొంతమంది బాలీవుడ్ సినిమాలను ఓ మాట అనేవారు. అయితే సద్విమర్శలే ఎక్కువగా ఉండేవి. అంతెందుకు మన హీరోలను మన హీరోల ఫ్యాన్స్ నోటికొచ్చింది అనడం చూసుంటారు.
అయితే, పక్క ఇండస్ట్రీ హీరోలను కించపరచకూడదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ‘సలార్’ సినిమా మీద, ప్రభాస్ మీద విషం చిమ్ముతోంది బాలీవుడ్ క్రిటిక్ జనం. సోషల్ మీడియా ఛానల్ / పేజీ ఉన్న ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అయిపోయారు అని వచ్చే విమర్శకు నిలువెత్తు నిదర్శనంగా బాలీవుడ్ జనాలు ‘సలార్’ రివ్యూలు చెబుతున్నారు. ఈ క్రమంలో విమర్శిస్తే ఓకే.. కావాలంటే బురద జల్లుతున్నారు. ఏ రేంజిలో అంటే ‘ప్రభాస్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కన్నా శవం ఫేస్‌లో ఎక్కువ ఉంటాయి’ అనేంతవరకు.
సినిమాలో(Salaar) లోపాలు చెబితే, ప్రభాస్‌ను చూపించిన విధానంలో ఇబ్బందులు చెబితే, కథను నడిపే విధాంలో తప్పులు చెబితే, కథనంలో కష్టం చెబితే, నటనలో సూచనలు చెబితే ఓకే కానీ… ఇలా నోటికొచ్చింది అనడం కరెక్ట్ కాదు అని నెటిజన్లు అంటున్నారు. ‘డంకీ’ సినిమా కారణంగా ‘సలార్’ను ఇలా ఆడిపోసుకుంటున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. కారణం వాళ్లకే తెలియాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!