సినిమాలకు అందులోనూ యాక్షన్ సినిమాలకు నేపథ్యం సంగీతం చాలా ముఖ్యం. ఈ మాట ఎవరైనా చెబుతారు. అంతెందుకు గతేడాది వచ్చిన ‘అఖండ’ విజయం వెనుక నేపథ్య సంగీతం ప్రభావం చాలా ఎక్కువ అని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ‘గాడ్ ఫాదర్’, ‘బ్రో’ లాంటి సినిమాలు ఆ మాత్రం విజయం సాధించాయన్నా నేపథ్య సంగీతం వల్లనే అని అంటారు. అంతెందుకు ‘జైలర్’ సినిమా విజయంలో అనిరుధ్ పాత్ర గురించి కూడా ఇటీవల విన్నాం.
అయితే ఇలాంటి విజయాలు అన్నీ దర్శకుడు – సంగీత దర్శకుడు కాంబినేషన్ వల్లనే అని సులభంగా చెప్పేయొచ్చు. అయితే పై సినిమాల్లో ఓ సినిమా దర్శకుడు మాత్రం అలా అనుకోవడం లేదు. అంతేకాదు దాని గురించి ఓపెన్‌గా కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే విషయం గురించి చర్చ నడుస్తోంది. ఆ మాటకొస్తే ఆ దర్శకుడు ఇలా గతంలో ఓ సంగీత దర్శకుడు విషయంలో కూడా కామెంట్లు చేశారు. దీంతో అప్పుడు దేవిశ్రీప్రసాద్, ఇప్పుడు తమన్ ఆ అని అడుగుతున్నారు.
‘లెజెండ్’ సినిమా ప్రచారంలో భాగంగా బోయపాటి మాట్లాడుతూ ‘దేవిశ్రీప్రసాద్‌ను బాగా పిండి పాటలు చేయించుకున్నాను’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ తర్వాత ఈ విషయంలో చాలా పెద్ద పంచాయితీ నడిచి, ఆ తర్వాత సద్దుమణిగిపోయింది. దీని వెనుక ఓ హీరో, నిర్మాత ఉన్నారని.. వాళ్లే నాడు ఈ సమస్యను పరిష్కరించారు అని అనేవారు. ఇప్పుడు మళ్లీ బోయపాటి (Boyapati Srinu) మాట్లాడుతూ తమన్ పనితనం గురించి తక్కువ చేసి మాట్లాడారు.
దీంతో ఆయనేం మారలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అఖండ’ సినిమాలో కొన్ని సన్నివేశాలకు సంగీతమే ప్రధానం అని అంటుంటే… బోయపాటి మాత్రం సంగీతం లేకపోయినా ఆ సినిమాలో సన్నివేశాలు అదిరిపోయేవి అని అన్నారు. అందులో నిజం ఉండొచ్చు కాక… కానీ తమన్ పనితనాన్ని తగ్గించడం ఎంతవరకు సరైన చర్య అని నెటిజన్లు అడుగుతున్నారు. మరి ఈ మాటలు తమన్ వరకు వెళ్తాయా అని అనుకుంటే… ఆయన ‘ఐ డోంట్ కేర్’ అంటూ ట్వీట్ చేశారు. మరి ఎందుకో ఆయనే చెప్పాలి.